AFG vs SA: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సెంచ‌రీ కొట్టిన ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్ ర్యాన్ రికెల్ట‌న్

Published : Feb 21, 2025, 07:23 PM IST

Ryan Rickelton: ఛాంపియన్స్ ట్రోఫీ అరంగేట్రంలోనే సౌతాఫ్రికా క్రికెట‌ర్, ముంబై ఇండియ‌న్స్ యంగ్ ప్లేయ‌ర్ ర్యాన్ రికెల్టన్ సెంచరీతో అద‌ర‌గొట్టాడు.   

PREV
15
AFG vs SA: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో సెంచ‌రీ కొట్టిన ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్ ర్యాన్ రికెల్ట‌న్
Image Credit: Getty Images

Afghanistan vs South Africa: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ శుక్రవారం కరాచీలోని నేషనల్ స్టేడియంలో త‌న తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టోనీ డి జోర్జీ మిన‌హా వ‌చ్చిన ప్లేయ‌ర్లు అంద‌రూ ప‌రుగులు  చేయ‌డంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశ‌గా ముందుకు సాగింది. ఇక ఈ మ్యాచ్ తో దక్షిణాఫ్రికా ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎంట్రీ ఇచ్చాడు. త‌న తొలి మ్యాచ్ లోనే ఈ ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. దీంతో సౌతాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. 

25

కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో ర్యాన్ రికెల్ట‌న్ త‌న బ్యాటింగ్ స‌త్తాను ప్ర‌ద‌ర్శిస్తూ సెంచ‌రీ కొట్టాడు. కరాచీ పిచ్ పరిస్థితులలో మొదట బ్యాటింగ్ చేయాలని కెప్టెన్ టెంబా బావుమా తీసుకున్న నిర్ణయం ఫలించింది. రికెల్టన్ సెంచ‌రీ తో పాటు టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రమ్ లు హాఫ్ సెంచ‌రీలు సాధించారు. ర్యాన్ రికెల్ట‌న్ కు ఇది తొలి వ‌న్డే సెంచ‌రీ కావ‌డం విశేషం. 

బావుమాతో రికెల్టన్ భాగస్వామ్యం దక్షిణాఫ్రికా స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించ‌డంలో స‌హాయ‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేయ‌డంలో రికెల్టన్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలోనే మ‌రో ఓపెనర్ టోనీ డి జోర్జీ (11) వికెట్ కోల్పోయిన తర్వాత, అతను రెండో వికెట్‌కు కెప్టెన్ బావుమా (58 ప‌రుగులు)తో కలిసి 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బావుమా ఔట్ అయిన త‌ర్వాత త‌న బ్యాటింగ్ దూకుడు కొన‌సాగిస్తూ వ‌న్డేల్లో తొలి సెంచ‌రీ (103 ప‌రుగులు) కొట్టాడు. త‌న 103 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు.

35
Temba Bavuma

రషీద్ ఖాన్ అద్భుతమైన రనౌట్ తో పెవిలియ‌న్ కు ర్యాన్ రికెల్ట‌న్

మంచి జోష్ లో ఉన్న స‌మ‌యంలో రషీద్ ఖాన్ అద్భుతమైన రనౌట్ తో  ర్యాన్ రికెల్ట‌న్ పెవిలియ‌న్ కు చేరాడు. చివరికి రికెల్టన్ 106 బంతుల్లో 103 పరుగులు చేసి ఏడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఇది అతని తొలి వన్డే సెంచరీ. దీంతో తాను ఆడిన 7 మ్యాచ్ ల‌లో 41.57 స‌గ‌టుతో 291 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచ‌రీ, ఒక హాఫ్ సెంచ‌రీ ఉన్నాయి.

సెంచ‌రీతో లెజెండ‌రీ ప్లేయ‌ర్ల క్ల‌బ్ లో చేరిన ర్యాన్ రికెల్ట‌న్ 

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో చ‌రిత్రలో సెంచరీ చేసిన 5వ సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా ర్యాన్ రికెల్టన్ నిలిచాడు, హెర్షెల్ గిబ్స్, గ్రేమ్ స్మిత్ , జాక్వెస్ కల్లిస్, హషీమ్ ఆమ్లా మాజీ స్టార్ల ఎలైట్ గ్రూప్ లో చేరాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు సెంచ‌రీల‌తో గిల్స్ సౌతాఫ్రికా సెంచ‌రీ ప్లేయ‌ర్ల లిస్టులో టాప్ లో ఉన్నాడు. 

45

ఐపీఎల్ ముంబై ఇండియ‌న్స్ లో ర్యాన్ రికెల్ట‌న్ 

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జ‌ట్టు త‌రఫున ర్యాన్ రికెల్ట‌న్ ఆడుతున్నాడు. గత సంవత్సరం మెగా వేలంలో అతను తన మొట్టమొదటి IPL కాంట్రాక్టును పొందాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ను ముంబై ఇండియన్స్ ₹1 కోటికి కొనుగోలు చేసింది. రాబోయే సీజన్‌లో అతను హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఆడనున్నాడు.

55

SA20లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసిన‌ ర్యాన్ రికెల్టన్

ర్యాన్ రికెల్టన్ SA20లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అయిన‌ MI కేప్ టౌన్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడుతున్నాడు. 2025 SA20 సీజన్‌లో రికెల్ట‌న్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. 48 సగటు, 179 స్ట్రైక్ రేట్‌తో 336 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శన MI కేప్ టౌన్ విజయంలో కీల‌క పాత్ర పోషించింది.  SA20 ప్ర‌ద‌ర్శ‌న‌ను ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌తో కూడా కొన‌సాగించాల‌ని చూస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories