ఐపీఎల్ 2023లో ముగ్గురు కొత్త కెప్టెన్లు... నితీశ్ రాణా, మార్క్‌రమ్, శిఖర్ ధావన్‌లలో సక్సెస్ దక్కెదెవరికి...

Published : Mar 28, 2023, 12:19 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌కి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు జోరుగా ప్రాక్టీస్ మొదలెట్టేశాయి. ఐపీఎల్ 2023 సీజన్‌లో ముగ్గురు కొత్త కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు...

PREV
17
ఐపీఎల్ 2023లో ముగ్గురు కొత్త కెప్టెన్లు... నితీశ్ రాణా, మార్క్‌రమ్, శిఖర్ ధావన్‌లలో సక్సెస్ దక్కెదెవరికి...
Sanju Samson-KL Rahul

ఐపీఎల్ 2021 సీజన్‌లో సంజూ శాంసన్, రిషబ్ పంత్ కెప్టెన్లుగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు కెఎల్ రాహుల్. 2022 సీజన్‌లో మొదటిసారి కెప్టెన్‌గా మారాడు హార్ధిక్ పాండ్యా... వీరందరూ కూడా కెప్టెన్లుగా సక్సెస్ అయ్యారు.

27

రిషబ్ పంత్, కెప్టెన్‌గా తొలి సీజన్‌లో ఢిల్లీని ప్లేఆఫ్స్ చేర్చగా సంజూ శాంసన్ కెప్టెన్సీలో 2022 సీజన్‌లో ఫైనల్ చేరింది రాజస్థాన్ రాయల్స్. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్, 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ ఆడింది..  ఒక్క మయాంక్ అగర్వాల్, జడేజా మాత్రమే గత సీజన్‌లో కెప్టెన్లుగా ఫెయిల్ అయ్యారు.

37
Image credit: PTI

2022 సీజన్‌లో మొట్టమొదటిసారి కెప్టెన్సీ చేస్తూనే టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా, ఆ విజయం తర్వాత టీమిండియాకి టీ20 కెప్టెన్ కూడా అయిపోయాడు. దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్నవారిపై ప్రత్యేకమైన ఫోకస్ పెడుతున్నాయి ఫ్రాంఛైజీలు...

47

శ్రేయాస్ అయ్యర్ గాయంతో బాధపడుతుండడంతో అతని ప్లేస్‌లో నితీశ్ రాణాని తాత్కాలిక సారథిగా ఎంచుకుంది కేకేఆర్. దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించే నితీశ్ రాణాకి ఇది చాలా పెద్ద అవకాశమే. ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, షకీబ్ అల్ హసన్ వంటి సీనియర్లను పక్కనబెట్టి నితీశ్ రాణాపై నమ్మకం ఉంచింది కేకేఆర్.. 
 

57

2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్, 2022 సీజన్‌లో కేన్ విలియంసన్‌లను కెప్టెన్లుగా వాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈసారి అయిడిన్ మార్క్‌రమ్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కెప్టెన్‌గా అండర్19 వరల్డ్ కప్‌తో పాటు సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ గెలిచిన అయిడిన్ మార్క్‌రమ్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది ఆరెంజ్ ఆర్మీ...
 

67
Image credit: PTI

సీజన్‌కో కెప్టెన్‌ని మార్చే పంజాబ్ కింగ్స్, 2021 సీజన్‌లో కెఎల్ రాహుల్‌ని, 2022 సీజన్‌లో మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా వాడింది. ఈ ఇద్దరూ కూడా పంజాబ్ కింగ్స్‌ని 6వ ప్లేస్‌ నుంచి పైకి చేర్చలేకపోయారు. దీంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి...
 

77
Image credit: PTI

37 ఏళ్ల లేటు వయసులో పంజాబ్ కింగ్స్‌కి పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు పంజాబ్ కింగ్స్. లియామ్ లివింగ్‌స్టోన్, సికిందర్ రజా, రిషి ధావన్, సామ్ కుర్రాన్, భనుక రాజపక్ష, రాహుల్ చాహార్, కగిసో రబాడా, అర్ష్‌దీప్ సింగ్ వంటి స్టార్లతో నిండిన పంజాబ్ కింగ్స్‌ని గబ్బర్ ఈసారి అయినా ప్లేఆఫ్స్ చేర్చగలడేమో చూడాలి..

click me!

Recommended Stories