ఏబీడీ, వెనక్కి వచ్చేయ్... ‘మిస్టర్ 360’కి ఆఫర్ ఇచ్చిన సౌతాఫ్రికా కోచ్ మార్క్ బ్రౌచర్

First Published Apr 16, 2021, 6:19 PM IST

‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్‌, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న తర్వాత సౌతాఫ్రికా క్రికెట్ జట్టు పరిస్థితి మరీ ఘోరంగా మారింది. చిన్నచిన్న జట్లతో కూడా మ్యాచులు ఓడిపోతున్న సఫారీ టీమ్‌ను కాపాడడానికి ఏబీ డివిల్లియర్స్, రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని, రీఎంట్రీ ఇవ్వాలని కోరాడు సౌతాఫ్రికా కోచ్ మార్క్ బ్రౌచర్..

2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్... అప్పటినుంచి సఫారీ జట్టు పతనం మొదలైంది...
undefined
2019 వన్డే వరల్డ్‌కప్‌లో కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది సౌతాఫ్రికా క్రికెట్ జట్టు. 2019 వరల్డ్‌కప్‌లో వరుస మ్యాచుల్లో ఓడిపోవడంతో అవసరమైతే రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి సిద్ధమంటూ ప్రకటించాడు ఏబీడీ..
undefined
అయితే భవిష్యత్‌లో జట్టు పటిష్టంగా మారడానికి కావాల్సిన చర్యలు తీసుకునేందుకు ఏబీ డివిల్లియర్స్ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.
undefined
ప్రస్తుతం సఫారీ టీమ్ పర్ఫామెన్స్ రోజురోజుకీ దారుణంగా తయారుకావడంతో తిరిగి రావాల్సిందిగా ఏబీడీని కోరింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు...
undefined
‘ఏబీ డివిల్లియర్స్‌తో కొన్ని నెలలుగా రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడంపై చర్చలు జరుగుతున్నాయి. అతని నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నా...
undefined
ఏబీ డివిల్లియర్స్, ఓ అద్భుతమైన క్రికెటర్ అంతకుమించిన మంచి మనిషి కూడా... ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు ఏబీ డివిల్లియర్స్...
undefined
రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు అవుతున్నా, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఏబీ డివిల్లియర్స్, సఫారీ జట్టుకి మరోసారి కీలక ప్లేయర్‌గా మారతాడని ఆశపడుతున్నాం... ’ అంటూ చెప్పుకొచ్చాడు సఫారీ జట్టు కోచ్ మార్క్ బ్రౌచర్...
undefined
‘ఐపీఎల్ 2021 ఆరంభానికి ముందే రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడం గురించి మాట్లాడాను. అతను ఐపీఎల్ ఆడబోతున్న విషయం చెప్పాడు. వెళ్లి ఆడమని చెప్పాను. ఐపీఎల్‌ సమయంలో కూడా మా సపోర్ట్ ఉంటుందని చెప్పాం’ అంటూ వివరించాడు మార్క్ బ్రౌచర్...
undefined
ఐపీఎల్ 2021 సీజన్ మొదటి మ్యాచ్‌లో 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విజయాన్ని అందించాడు ఏబీ డివిల్లియర్స్...
undefined
2021 టీ20 వరల్డ్‌కప్‌, ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరగనుంది. ప్రస్తుతం సఫారీ జట్టు ఉన్న ఫామ్ చూస్తే, ఆ జట్టు కనీసం పోరాటం ఇస్తుందన్న నమ్మకం కూడా ఎవ్వరికీ లేదు...
undefined
click me!