ఐసీసీ టీ20 జట్టుకి కెప్టెన్‌గా ధోనీయా? ఏం చేశాడని... అతన్ని ఎందుకు చేర్చలేదు...

First Published Jan 1, 2021, 12:07 PM IST

ఐసీసీ మెన్స్ టీ20 జట్టుపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. జట్టులో ముగ్గురు బౌలర్లు మాత్రమే ఉండడం, ఒక్క పాక్ ప్లేయర్‌కి కూడా చోటు దక్కకపోవడంపై ట్రోల్స్ వినిపించాయి. 22 ఏళ్ల రషీద్ ఖాన్‌ను టీ20 క్రికెటర్ ఆఫ్ ది డికేట్‌గా ఎంపిక చేయడం కూడా ట్రోలింగ్‌కి కారణమైంది. ఇప్పుడు తాజాగా మహేంద్ర సింగ్ ధోనీని టీ20 జట్టుకి కెప్టెన్‌గా ఎన్నుకోవడాన్ని తప్పుబట్టాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

ఐసీసీ మెన్స్ టీ20, వన్డే జట్లకు కెప్టెన్‌గా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంపికయ్యాడు... వికెట్ కీపర్‌గా కూడా ధోనీకే అవకాశం దక్కింది...
undefined
అయితే 2011-2020 సీజన్ మధ్యలో మహేంద్ర సింగ్ ధోనీ టీ20ల్లో పెద్దగా చేసింది ఏమీ లేదని, అతన్ని ఎందుకు కెప్టెన్‌గా ఎంపిక చేశాడని ప్రశ్నించాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
undefined
‘ఐసీసీ మెన్స్ టీ20 జట్టులో ధోనీ ఎందుకున్నాడో నాకు అర్థం కాలేదు... ఈ దశాబ్దంలో మాహీ బ్యాటుతో కానీ, కెప్టెన్‌గా కానీ పెద్దగా విజయాలేమీ అందుకోలేదు...
undefined
వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే జోస్ బట్లర్ ఉన్నాడు... ఐసీసీ టీమ్‌లో బట్లర్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచింది... ’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా.
undefined
2011 నుంచి 2020 మధ్య దశాబ్ద కాలంలో 73 టీ20 మ్యాచులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ... 1176 పరుగులు చేశాడు.
undefined
2011లో టీ20ల్లో అంతర్జాతీయ ఎంటరీ ఇచ్చిన జోస్ బట్లర్... ఈ దశాబ్ద కాంలో 74 టీ20 మ్యాచులు ఆడిన 1551 పరుగులు చేశాడు..
undefined
అయితే మహేంద్ర సింగ్ ధోనీపై కామెంట్ చేసిన ఆకాశ్ చోప్రాపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు మాహీ ఫ్యాన్స్...
undefined
‘భారత జట్టుకు 2007 టీ20 వరల్డ్‌కప్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ ఇవ్వడం తప్పా?’ అని కొందరు నిలదీస్తుంటే... ‘టీ20 క్రికెట్ ఆడని ఆకాశ్ చోప్రా, ధోనీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని?’ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
undefined
‘2007లో వరల్డ్‌కప్ గెలిస్తే... 2011 నుంచి మొదలయ్యే దశాబ్దంలో కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేస్తారంటూ’ మాహీ ఫ్యాన్స్‌కి కొందరు టీమిండియా అభిమానులు సమాధానం చెబుతున్నారు.
undefined
ఇలా అయితే సెహ్వాగ్, సచిన్ లాంటి క్రికెటర్లకు కూడా వన్డే, టీ20 టీమ్‌ల్లో చోటు ఇవ్వాల్సిందని మాహీ ఫ్యాన్స్‌ను ఎద్దేవా చేస్తున్నారు..
undefined
భారత జట్టుకి 2011 వన్డే వరల్డ్‌కప్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది డికేట్‌కి కూడా కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే.
undefined
అయితే ఐసీసీ డికేట్ అవార్డుల్లో పాక్ క్రికెటర్లలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. దీంతో ఇవి ఐసీసీ అవార్డులు కావు, ఐపీఎల్ అవార్డులు అంటూ విమర్శలు చేస్తున్నారు పాక్ క్రికెట్ అభిమానులు.
undefined
click me!