7 కోట్లు! 7 కోట్లు! విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్టులపై షాబజ్ అహ్మద్ కామెంట్లు... దేని గురించో తెలియక...

Published : Oct 28, 2022, 10:53 AM IST

ప్రపంచవ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇన్‌స్టాగ్రామ్‌లో 220 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ, ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్ 3 సెలబ్రిటీల్లో ఒకడిగా ఉన్నాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న విరాట్, ప్రతీ మ్యాచ్ తర్వాత ఇన్‌స్టాలో పోస్టులు పెడుతున్నాడు...

PREV
18
7 కోట్లు! 7 కోట్లు! విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్టులపై షాబజ్ అహ్మద్ కామెంట్లు... దేని గురించో తెలియక...
Virat Kohli-Suryakumar Yadav

తన తోటి క్రికెటర్లకు ఇన్‌స్టా స్టోరీస్‌లో విషెస్ తెలిపే విరాట్ కోహ్లీ, మ్యాచ్ ప్రాక్టీస్, రిజల్ట్ అనంతరం పోస్టులు చేస్తుంటాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్  విజయం తర్వాత విరాట్ కోహ్లీ చేసిన పోస్టుకి కోటికి పైగా లైకులు వచ్చాయి. ట్విట్టర్‌లో చేసిన పోస్టుకి 75 లక్షలకు పైగా లైకులు వచ్చి, ఈ ఏడాది అత్యధిక లైక్స్ సాధించిన ట్వీట్‌గా నిలిచింది...

28
kohli

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించిన విరాట్ కోహ్లీ, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. ఈ మ్యాచ్ తర్వాత ‘మరో స్ట్రాంగ్ రిజల్ట్... ఇండియా’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు షేర్ చేశాడు విరాట్ కోహ్లీ. దీనికి సూర్యకుమార్ యాదవ్ ‘సూర్‌వీర్’ అంటూ చేసిన కామెంట్ అందరి దృష్టినీ ఆకర్షించింది...

38

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ కలిసి హాఫ్ సెంచరీలతో రాణించి, భారత జట్టుకి 179 పరుగుల భారీ స్కోరు అందించగలిగారు. విరాట్‌తో బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెప్పిన సూర్య భాయ్... ఇలా తమ పేర్లను కలుపుతూ కామెంట్ చేశాడు...

48
Virat Kohli

అయితే దీనికి ఆర్‌సీబీ ఆల్‌రౌండర్, టీమిండియా క్రికెటర్ షాబజ్ అహ్మద్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ‘7 కోట్లు...’ ‘7 కోట్లు’ అంటూ రెండు సార్లు ట్వీట్ చేసి చేతులు పైకెత్తుతున్న ఎమోజీలను జత చేశాడు షాబజ్ అహ్మద్. ఏమిటి 7 కోట్లు, దేనికీ 7 కోట్లు... అనేది చెప్పకపోవడంతో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి...

58
Shahbaz Ahmed

టీమిండియా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో A+ కేటగిరిలో ఉన్న విరాట్ కోహ్లీ, ఏటా రూ.7 కోట్లు తీసుకుంటున్నాడు. షాబజ్ అహ్మద్ దీని గురించి కానీ మరోసారి గుర్తు చేశాడా? అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. టీమిండియాలోకి ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చిన షాబజ్ అంత సాహసం చేయగలడా? అలా కింగ్ కోహ్లీని ట్రోల్ చేయగలడా?

68
Image credit: PTI

మరికొందరేమో విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టు ద్వారా రూ.7 కోట్లు తీసుకుంటున్నాడని, షాబజ్ అహ్మద్ దాన్ని గుర్తు చేస్తున్నాడేమోనని అనుమానిస్తున్నారు. మరికొందరేమో షాబజ్ అహ్మద్ చేసిన కామెంట్లను డీకోడ్ చేసే పనిలో పడ్డారు...

78

కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోలో ఆఖరి ప్రశ్నకు సరైన సమాధానం చెబితే వచ్చే ప్రైజ్‌మనీ రూ.7 కోట్లు. అత్యంత క్లిష్టమైన, కష్టమైన ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత తేలికైన విషయం కాదు. విరాట్ కోహ్లీ కూడా ఓ ఖరీదైన ప్రశ్న అని షాబజ్ అహ్మద్ అంటున్నాడని కామెంట్లు చేస్తున్నారు...

88

ఇంకొందరైతే ఇంకో అడుగు ముందుకేసి ఐపీఎల్‌లో తనని రూ.7 కోట్లకు తీసుకోవాల్సిందిగా విరాట్ కోహ్లీకి ఇలా ఆర్జీ పెట్టుకుంటున్నాడని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు... మొత్తానికి షాబజ్ అహ్మద్ చేసిన 7 కోట్ల కామెంట్‌కి అర్థం ఏంటో అతనే చెప్పాలి... 

Read more Photos on
click me!

Recommended Stories