పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఉత్కంఠ విజయం అందుకుంది భారత జట్టు. ఆ తర్వత నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లోనూ ఈజీ విక్టరీ అందుకున్న టీమిండియా, సెమీస్ రేసుకు చేరువైంది. మరోవైపు పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలై, సెమీస్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది...
టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 1 పరుగు తేడాతో ఓడింది. రెండు మ్యాచుల్లోనూ ఆఖరి బంతి వరకూ పోరాడినా పాక్‌కి విజయం మాత్రం దక్కలేదు...
టీ20 వరల్డ్ కప్‌లో మొట్టమొదటిసారి సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించిన జింబాబ్వే, తమపై తిరుగులేని రికార్డు ఉన్న పాకిస్తాన్‌కి చుక్కలు చూపించి...చారిత్రక విజయం అందుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా లక్కీగా ఓటమి నుంచి తప్పించుకున్న జింబాబ్వే ఖాతాలో ఇప్పుడు 3 పాయింట్లు ఉన్నాయి...
pakistan
టీమిండియాతో మ్యాచ్‌లో ఓడినా బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచుల్లో జింబాబ్వే గెలవగలిగితే సెమీ ఫైనల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే భారత జట్టు, సౌతాఫ్రికాని ఓడిస్తే చాలు... జింబాబ్వే సెమీస్ దారులు తెరుచుకుంటాయి. ఈ లెక్కలన్నీ పక్కనబెడితే జింబాబ్వే చేతుల్లో పాక్ ఓటమిని భారత క్రికెట్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు.
మన విజయం కంటే శత్రువు పరాజయం ఎక్కువ కిక్కు ఇస్తుందని నిరూపిస్తూ... జింబాబ్వేతో మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 11 కావాల్సిన సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్ అమాంతం పెరిగిపోయాయి. జింబాబ్వే చేతుల్లో పొరుగుదేశం ఓటమిని చూసేందుకు అందరూ ఒక్కసారిగా మ్యాచ్‌పై ఆసక్తి చూపించారు...
ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రియల్ టైం వ్యూస్ 18.6 మిలియన్లను దాటగా ఇండియా- నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది 12 మిలియన్లకు పైగా ఉంది...
pakistan team
ఈ రెండు మ్యాచుల తర్వాత జింబాబ్వే- పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ సమయంలో డిస్నీప్లస్ హాట్ స్టార్ రియల్ టైం వ్యూస్ 6.5 మిలియన్లకు చేరాయి. అంటే నెదర్లాండ్స్‌తో మ్యాచ్ చూసిన సగం మందికి పైగా జింబాబ్వే మ్యాచ్ చూశారు. పాకిస్తాన్‌లో హాట్ స్టార్ రాదు...
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రసారాలు కేవలం ఇండియా, సింగపూర్, ఇంగ్లాండ్ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఇంగ్లాండ్, సింగపూర్ జనాలు... పాక్ మ్యాచ్‌ని చూసేందుకు ఆసక్తి చూపించే అవకాశమే లేదు. ఇక మిగిలింది భారతీయులే... మనవాళ్లకు పాకిస్తాన్‌పై ఏ లెవెల్లో కోపం, పగ నిండిపోయిందో జింబాబ్వే మ్యాచ్ మరోసారి నిరూపించినట్టైంది..