2019 వన్డే వరల్డ్ కప్ జట్టులో 7 మార్పులతో 2023 ప్రపంచ కప్‌కి.. 10 ఏళ్ల తర్వాత శిఖర్ ధావన్ లేకుండా...

Published : Sep 05, 2023, 03:32 PM IST

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పోరాడి ఓడింది. 2023 వన్డే వరల్డ్ కప్‌కి ఎంపిక చేసిన జట్టులో, 2019 వరల్డ్ కప్ ఆడిన 8 మంది ప్లేయర్లకు చోటు దక్కింది..

PREV
110
2019 వన్డే వరల్డ్ కప్ జట్టులో 7 మార్పులతో 2023 ప్రపంచ కప్‌కి.. 10 ఏళ్ల తర్వాత శిఖర్ ధావన్ లేకుండా...

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్... 2019 వన్డే వరల్డ్ కప్ ఆడి, 2023 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకున్నారు..

210
Image credit: Getty

శిఖర్ ధావన్ లేకుండా 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఐసీసీ వన్డే టోర్నీ ఆడబోతోంది భారత జట్టు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టీమిండియాకి ఐసీసీ వన్డే టోర్నీల్లో కీ ప్లేయర్‌గా మారాడు శిఖర్ ధావన్..
 

310
Rohit Sharma

శిఖర్ ధావన్ ప్లేస్‌లో శుబ్‌మన్ గిల్, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు. గాయంతో ధావన్, వరల్డ్ కప్ మధ్యలో టీమ్‌కి దూరం కావడం జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపింది..

410

దినేశ్ కార్తీక్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్, టీమిండియాకి నాలుగో స్థానంలో ఆడబోతున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో దినేశ్ కార్తీక్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు..ఈసారి అయ్యర్‌పై బోలెడు ఆశలు పెట్టుకుంది భారత జట్టు.

510

మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో ఇషాన్ కిషన్, ఈ సారి వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ కూడా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు... మాహీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చి ఉంటే, సెమీస్‌లో టీమిండియా ఈజీగా గెలిచి ఉండేది..
 

610
Suryakumar Yadav

విజయ్ శంకర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. అప్పుడు అంబటి రాయుడిని కాదని విజయ్ శంకర్‌ని వరల్డ్ కప్‌కి ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. 

710
Vijay Shankar, Virat Kohli

పాక్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన విజయ్ శంకర్, నెట్స్‌‌లో గాయపడి వరల్డ్ కప్‌ నుంచి తప్పుకున్నాడు.. ఇప్పుడు సంజూ శాంసన్‌ని కాదని, సూర్యకుమార్ యాదవ్‌ని వన్డే వరల్డ్ కప్‌కి ఎంపిక చేయడం వివాదాస్పదమవుతోంది..

810

కేదార్ జాదవ్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోతుంటే, భువనేశ్వర్ కుమార్ ప్లేస్‌లో మహ్మద్ సిరాజ్.. ప్రపంచ కప్‌ జట్టుకి ఎంపికయ్యాడు..

910
Shardul Thakur

లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోతున్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఎక్కువ వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కావడం విశేషం..

1010

భువనేశ్వర్ కుమార్ ప్లేస్‌లో మహ్మద్ సిరాజ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోతున్నాడు. ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి ఎగబాకి, మళ్లీ కిందకి పడిపోయిన సిరాజ్‌పై ఈసారి చాలా అంచనాలు ఉన్నాయి..

click me!

Recommended Stories