6 బంతుల్లో 6 సిక్సర్లు ‍- సెంచ‌రీ హీరో సంజూ శాంస‌న్ ఏం చెప్పాడో తెలుసా?

First Published | Oct 13, 2024, 1:01 PM IST

Sanju Samson: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో భారత వికెట్‌కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత‌మైన బ్యాటింగ్ తో సెంచ‌రీ బాదాడు. అత‌ని ఇన్నింగ్స్ లో వ‌రుస‌గా ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడం హైలెట్ గా నిలిచాయి. 
 

Sanju Samson

Sanju Samson: బంగ్లాదేశ్ తో జ‌రిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను భార‌త్ 3-0 అధిక్యంతో కైవ‌సం చేసుకుంది. అద్భుత‌మైన ఆట‌తీరుతో ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ బంగ్లాదేశ్ టీమ్ కు టీమిండియా దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. మ‌రీ ముఖ్యంగా మూడో టీ20లో భార‌త బ్యాట‌ర్ల జోరును చూసి బంగ్లా ఆట‌గాళ్ల‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. 

హైదరాబాద్‌లో శనివారం జరిగిన మూడవ, చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో టీమిండియా 133 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత యువ జట్టు బలమైన ప్రదర్శన చేసి మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. ఈ మ్యాచ్ లో భార‌త్ భారీ విజ‌యం సాధించ‌డంలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, సూర్య‌కుమార్ యాద‌వ్ లు కీల‌క పాత్ర పోషించారు. 

సంజూ శాంసన్ బ్యాటింగ్ విధ్వంసం

శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో సంజూ శాంస‌న్ భార‌త క్రికెట్ లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే అన్నింగ్స్ ఆడాడ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. సంజు శాంసన్ 236.17 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ కొనసాగించాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. 40 బంతుల్లోనే  సెంచరీ బాదాడు.

సంజూ శాంసన్‌ ఇన్నింగ్స్‌ ఆధారంగా బంగ్లాదేశ్‌పై భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు చేసింది. అంర్జాతీయ క్రికెట్ లో ఐసీసీ ఫుల్ టైమ్ గుర్తింపు ఉన్న జ‌ట్టు చేసిన అత్య‌ధిక ప‌రుగులు ఇవే. ఇక భారీ లక్ష్యం ఒత్తిడిలో బంగ్లాదేశ్ జట్టు కుప్పకూలింది. బంగ్లాదేశ్‌ 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుత ప్రదర్శనతో సంజూ శాంసన్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు.

Latest Videos


సంజూ శాంసన్ 6 బంతుల్లో 6 సిక్సర్లపై ఏం చెప్పాడంటే? 

త‌న ధనాధ‌న్ ఇన్నింగ్స్‌లో సంజు శాంసన్ 6 వరుస బంతుల్లో 5 సిక్స‌ర్లు బాదాడు. భారత్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ బౌలింగ్ చిత్తుచిత్తు చేశాడు. రిషద్ హుస్సేన్ వేసిన ఈ ఓవర్లో సంజూ శాంసన్ వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు బాదాడు. సంజూ శాంసన్‌ బ్యాటింగ్‌ జోష్ చూస్తుంటే 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదేలా క‌నిపించాడు. కానీ అది జరగలేదు. అతను ఈ రికార్డుకు కేవలం ఒక్క సిక్స్ దూరంలోనే ఉన్నాడు.

మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ, 'నేను గత ఏడాది కాలంగా ఇలాంటివి (ఓవర్‌లో ఐదు సిక్సర్లు) చేయాలని ప్రయత్నిస్తున్నాను. నేను దాని కోసం ప్ర‌య‌త్నిస్తున్నాను. ఈ రోజు అది జరిగింది. ఒత్తిడి - వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. నేను చాలాసార్లు విఫలమయ్యాను, కాబట్టి నా మనస్సును తదనుగుణంగా ఎలా నిర్వహించాలో నాకు తెలుసు. నేను ఆట‌పై దృష్టి పెట్టాలి అని నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను అని సంజూ శాంస‌న్" పేర్కొన్నాడు. 

చాలా ఒత్తిడి ఉంది : సంజూ శాంస‌న్ 

సంజూ శాంసన్ మాట్లాడుతూ.. 'దేశం కోసం ఆడుతున్నప్పుడు, మీరు చాలా ఒత్తిడితో వచ్చారు. మాపై ఒత్తిడి ఉంది.  అయినా నేను బాగా రాణించాలనుకుంటున్నాను. నేను ఏమి చేయగలనో చూపించాలనుకుంటున్నాను. నేను దానిని వీలైనంత సరళంగా ఉంచాలనీ, ఒక సమయంలో ఒక బంతిపై దృష్టి పెట్టాలని, నా షాట్‌లు ఆడాలని నాకు నేను గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. డ్రెస్సింగ్ రూమ్, మా వద్ద ఉన్న లీడర్‌షిప్ గ్రూప్ గురించి వారు నాతో ఎప్పటికప్పుడు - మీలో ఎలాంటి ప్రతిభ ఉందో నాకు తెలుసు.. మేము మీకు మద్దతు ఇస్తున్నాము అని చెబుతూనే ఉంటారని' పేర్కొన్నాడు.

Sanju Samson

సంజూ శాంస‌న్-సూర్య‌కుమార్ యాద‌వ్ ల సునామీ బ్యాటింగ్ 

ఇప్ప‌టికే బంగ్లాదేశ్ టీమ్ భార‌త్ తో టెస్టు సిరీస్ ఆడింది. ఇక్క‌డ రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని భార‌త్ జ‌ట్టు బంగ్లాను చిత్తుగా ఓడించి సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. ఇప్పుడు టీ20లో బంగ్లాదేశ్‌ను మ‌ట్టిక‌రిపించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సూర్య‌కుమార్ యాద‌వ్, సంజూ శాంస‌న్ ల సూప‌ర్ ఇన్నింగ్స్ తో  పరుగుల సునామీ వ‌చ్చింది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఒక ఐసీసీ ఫుల్‌టైమ్ దేశం సాధించిన అత్యధిక స్కోరు ఇదే. అంతకుముందు 2019లో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 278/3 స్కోర్ చేసింది. ఓవరాల్ రికార్డును పరిశీలిస్తే, 2023లో మంగోలియాపై నేపాల్ 314/3 పరుగులు చేసింది. నేపాల్ ఇంకా ఐసీసీలో పూర్తికాల సభ్య దేశం కాదు.

click me!