2020 రౌండప్: టీ20ల్లో టీమిండియా సూపర్ హిట్టు... వన్డేల్లో యావరేజ్... టెస్టుల్లో నాలుగింట్లో ఒక్కటే...
First Published | Dec 31, 2020, 10:15 AM IST2020 ఏడాది క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ లాంటోడే ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయకుండానే సీజన్‌ను ముగించాడంటే... 2020 ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది వరుస విజయాలతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో రారాజుగా నిలిచిన భారత జట్టు, ఈ ఏడాదిని వరుస పరాజయాలతో ప్రారంభించింది. వన్డే, టీ20లను విజయంతో ఆరంభించి, పరాజయాలతో ముగించింది. మొత్తంగా ఈ ఏడాది టీ20ల్లో సూపర్ హిట్టైన టీమిండియా, వన్డేల్లో యావరేజ్ ప్రదర్శన ఇవ్వగా టెస్టుల్లో ఫ్లాప్ అయ్యింది.