సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడిన టీమిండియా... పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్, ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై భారీ విజయం అందుకుంది. అయితే టీమిండియా- సౌతాఫ్రికాని ఓడించి ఉంటే పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండేవి...
india
భారత జట్టు ఓడినా పాక్ సెమీస్ రేసు నుంచి తప్పుకోవడం టీమిండియా ఫ్యాన్స్‌కి సంతోషాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా 2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సచిన్ టెండూల్కర్ సెంచరీ (111) కారణంగా 296 పరుగుల స్కోరు చేసింది. అయితే సౌతాఫ్రికా ఈ టార్గెట్‌ని 49.4 ఓవర్లలో ఛేదించింది...
2011 వన్డే వరల్డ్ కప్‌లో 2 బంతులు మిగిలి ఉండగా... 2022 టీ20 వరల్డ్ కప్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ సరిగ్గా 2 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది సౌతాఫ్రికా. దీంతో 2011 వన్డే వరల్డ్ కప్ సీన్ రిపీట్ అవుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు...
Ireland
అదీకాకుండా 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్ చేతుల్లో ఇంగ్లాండ్ పరాజయాన్ని చవిచూసింది. 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ పసికూన ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ని 5 పరుగుల తేడాతో (డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఓడించి చరిత్ర సృష్టించింది..
IND vs SA
2011 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై విజయాల తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడిన టీమిండియా... 2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ అచ్చు అలాగే మొదటి రెండు మ్యాచుల్లో పాక్, నెదర్లాండ్స్ టీమ్‌లను ఓడించి, తర్వాతి మ్యాచ్‌లో సఫారీ టీమ్ చేతుల్లో పరాజయం పాలైంది...
ఇవన్నీ చూస్తుంటే మహేంద్ర సింగ్ ధోనీ చెప్పినట్టే ‘2011లో ఓరియో, ఇండియాలో లాంఛ్ అయ్యింది... టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది... అనే ‘బిస్కెట్’ లాజిక్ వర్కవుట్ అవ్వబోతుందేమోనని అనుకుంటూ అంచనాలు పెంచేసుకుంటున్నారు టీమిండియా అభిమానులు..