కరోనా భయం, తిండి కూడా లేదు.. సెక్స్ వర్కర్ల కు నరకం

First Published | Apr 6, 2020, 10:57 AM IST

బ్యాంకాక్, పట్టయా ప్రాంతాల్లో పడుపు వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న వాళ్లనిప్పుడు కరోనా కాటేసింది. బ్యాంకాక్‌లో ఉండే సెక్స్ వర్కర్లు బార్లలో టిప్స్ కోసం పనిచేసేవాళ్లు. అక్కడికి వచ్చే కస్టమర్లతో మాట్లాడుకొని ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేసేవాళ్లు. 

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టి పీకిస్తోంది. ఈ వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలా బాధపడుతున్న వారిలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు. కనీసం తిండి కూడా దొరకక అల్లాడిపోతున్నారు.
అసలు ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే కొందరు సెక్స్ వర్కర్లు... తమ విధులకు స్వస్తి చెప్పారు. కరోనా కారణంగా తమకు కూడా భయం ఉందని.. ఈ క్రమంలో కొంత కాలం దూరంగా ఉన్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

మాకు మాత్రం కరోనా భయం లేదా అంటూ అందుకే.. ఓ రెండు వారాల పాటు తాము ఎవరినీ తమ దగ్గరకు కూడా రానివ్వడం లేదని చెప్పారు. ఈ క్రమంలో ఎప్పుడూ కిటకిటలాడే ఏరియాలు కూడా నిర్మానుషంగా మారాయి.
అయితే... ఈ క్రమంలో కనీసం తమకు తిండి కూడా దొరకడం లేదని వారు మొత్తుకోవడం గమనార్హం. సెక్స్ వర్కర్లకు స్వర్గధామమైన థాయిలాండ్‌లో వ్యభిచారిణుల పరిస్థితి ఇదీ. కరోనా దెబ్బకు ఒకరిద్దరు కాదు.. దాదాపు 3 లక్షల మంది రోడ్డున పడ్డారు.
బ్యాంకాక్, పట్టయా ప్రాంతాల్లో పడుపు వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న వాళ్లనిప్పుడు కరోనా కాటేసింది. బ్యాంకాక్‌లో ఉండే సెక్స్ వర్కర్లు బార్లలో టిప్స్ కోసం పనిచేసేవాళ్లు. అక్కడికి వచ్చే కస్టమర్లతో మాట్లాడుకొని ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేసేవాళ్లు.
అయితే, కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాటన్నింటికీ అక్కడి ప్రభుత్వం చెక్ పెట్టింది. దీంతో సెక్స్ వర్కర్లంతా పని లేకుండా, చేతిలో పైసల్లేకుండా తయారయ్యారు.
సెక్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. భారత్‌లోనూ చాలా మంది వ్యభిచారం చేసుకుంటూ పొట్టపోసుకునేవాళ్లే. కోల్‌కతాలో ఓ ప్రాంతంలో ఇలాగే నడుస్తోంది.
అయితే, కరోనా దెబ్బకు ఆ ప్రాంతం వెలవెలబోతోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం థాయిలాండ్‌లో 2వేల మందికి వైరస్ సోకగా, 20

Latest Videos

click me!