అతి దారుణంగా అమెరికా పరిస్థితి... ఒక్కరోజే 884 మరణాలు

First Published | Apr 2, 2020, 12:33 PM IST

కరోనాతో ఒక్కరోజులో అత్యధిక మంది మృతి చెందడం ఇదే కావడం గమనార్హం. అక్కడ కరోనా మృతుల సంఖ్య 5000 దాటింది.ఒకటిన్నర రోజులోనే 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రానికి 5,110 మంది అమెరికన్లు కరోనా బారినపడి మృతి చెందారు.
 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది.లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. వైరస్ ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా రోజూ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇక అమెరికా పరిస్థితి అయితే... అత్యంత దారుణంగా ఉంది.
undefined
ఇప్పటికే అమెరికాలో వైరస్ సోకిన వారి సంఖ్య 2లక్షలు దాటింది. ఒక మరణాల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. కేవలం ఒక్క రోజులోనే 884మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
undefined

Latest Videos


కరోనాతో ఒక్కరోజులో అత్యధిక మంది మృతి చెందడం ఇదే కావడం గమనార్హం. అక్కడ కరోనా మృతుల సంఖ్య 5000 దాటింది.ఒకటిన్నర రోజులోనే 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రానికి 5,110 మంది అమెరికన్లు కరోనా బారినపడి మృతి చెందారు
undefined
గడచిన 24 గంటల్లో 25,200 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 2,15,175 కేసులు నమోదయ్యాయి. కరోనా పురుడు పోసుకున్న చైనా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్‌ల కంటే కూడా అమెరికాలోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.
undefined
దేశంలో కరోనా మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, దాదాపు 2,40,000 మంది మృత్యువాత పడే అవకాశం ఉందని శ్వేతసౌద వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా 9,35,840 మందికి కరోనా వైరస్‌ సోకగా, 47,241 మంది మృతి చెందారు.
undefined
కాగా...బ్రిటన్‌లో కరోనావై‌రస్ బాధితుల మరణాలు విపరీతంగా పెరిగాయి.బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 563 మంది చనిపోయారు.
undefined
దేశానికి ఇదో దుర్దినమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వర్ణించారు. బ్రిటన్‌లో మొత్తంగా ఇప్పటివరకూ 2,352 మంది కరోనావైరస్‌తో మరణించారు.
undefined
అమెరికాలో రోజురోజుకీ పెరుగుతున్న మరణాలు తీవ్రంగా కలచివేస్తోందేని అధ్యక్షుడు ట్రంప్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ అమెరికన్లు ఇలాంటి పరిస్థితిని చూడలేదని ఆయన అన్నారు.
undefined
ఇదే పరిస్థితి మరి కొన్ని వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ భయంకరమైన వైరస్ తాము పోరు కొనసాగిస్తామని చెప్పారు.
undefined
click me!