అహ్మదాబాద్ : గుజరాత్‌లోని మోర్బీలో బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలిన ఘటనలో వందలాదిమంది జలసమాధి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 141 మంది చనిపోయినట్లు తెలుస్తోంది... ఇంకా చాలామంది ఆచూకీ లభించకలేదు కాబట్టి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్రమాదం నుండి దాదాపు 177మంది సురక్షితంగా బయటపడ్డారు.