Top 10 Sports Cars: కారు కాదు ఇది రోడ్డుపై వెళ్లే రాకెట్.. ప్రపంచంలో టాప్ 10 స్పోర్ట్స్ కార్లు ఇవే

Published : May 03, 2026, 03:51 PM IST

Top 10 Sports Cars : లగ్జరీ కార్లు ఎన్ని ఉన్న స్పోర్ట్స్ కార్లకు ఉన్న క్రేజే వేరు. మరి ప్రపంచంలో బెస్ట్ స్పోర్ట్స్ కార్లు ఏవో మీకు తెలుసా? టాప్ 10 స్పోర్ట్స్ కార్లు, వీటి ధరలు, స్పెసిఫికేషన్ల వివరాలు మీకోసం.

PREV
16
ప్రపంచంలో టాప్ 10 స్పోర్ట్స్ కార్లు ఇవే

ప్రపంచవ్యాప్తంగా కారు ప్రేమికులకు స్పోర్ట్స్ కార్లంటే ఎప్పుడూ ఒక క్రేజ్ ఉంటుంది. కేవలం జర్నీ కోసమే కాకుండా, అద్భుతమైన ఇంజనీరింగ్, స్పీడ్, లగ్జరీకి ఈ కార్లు పెట్టింది పేరుగా నిలుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో రేసింగ్ ట్రాక్ మీద మాత్రమే కాకుండా, సాధారణ రోడ్లపై కూడా రాకెట్ లా దూసుకుపోయే కార్లు మార్కెట్ లో ఉన్నాయి. షెవర్లే కొర్వెట్టి నుండి పోర్షే వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న టాప్ 10 స్పోర్ట్స్ కార్ల వివరాలు గమనిస్తే..

26
షెవర్లే, ఫోర్డ్

ఈ జాబితాలో మొదటి స్థానంలో షెవర్లే కొర్వెట్టి Z06 నిలిచింది. దీనిని 'అమెరికన్ ట్రాక్ వెపన్' అని పిలుస్తారు. ఇందులో 5.5 లీటర్ ఫ్లాట్-ప్లేన్ క్రాంక్ V8 ఇంజన్ ఉంటుంది, ఇది 670 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.6 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 330 కిమీ. దీని ధర సుమారు రూ. 1.5 కోట్లుగా ఉంది.

మరోవైపు, ఫోర్డ్ మస్టాంగ్ డార్క్ హార్స్ SC  అమెరికన్ పవర్ కార్ల వారసత్వాన్ని కొనసాగిస్తోంది. 700 hp ఉత్పత్తి చేసే సూపర్ ఛార్జ్డ్ V8 ఇంజన్‌తో ఇది క్లాసిక్ లుక్, లేటెస్ట్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ. 1.2 కోట్లు.

36
పోర్షే, బీఎండబ్ల్యూ

పోర్షే 911 GT3 RS రేస్ ట్రాక్ పై దుమ్మురేపుతుంది. ఇందులో 4.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది 2.7 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ఏరోడైనమిక్ డిజైన్ ట్రాక్ మీద బెస్ట్ స్పీడ్ ను అందిస్తుంది. దీని ధర సుమారు రూ. 3.5 కోట్లు.

అలాగే, బీఎండబ్ల్యూ M2 CS కాంపాక్ట్ సైజులో ఉండి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 523 hp ఇంజన్‌తో ఉండే ఈ కారు అద్భుతమైన హ్యాండ్లింగ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర సుమారు రూ. 1.2 కోట్లు.

46
ఫెరారీ, లంబోర్గిని

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫెరారీ తన ఫెరారీ 296 స్పెషల్ తో హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేసింది. V6 హైబ్రిడ్ సెటప్‌తో ఇది 868 bhp శక్తిని విడుదల చేస్తుంది. దీని ధర సుమారు రూ. 6 కోట్లు.

అలాగే, లంబోర్గిని తన ఐకానిక్ హురాకాన్ స్థానంలో లంబోర్గిని టెమెరారియో ను తీసుకువచ్చింది. ఇది 907 hp పవర్‌తో 10,000 rpm సామర్థ్యం కలిగి ఉంది. దీని అంచనా ధర సుమారు రూ. 6.8 కోట్లు.

56
లోటస్, నిస్సాన్

లోటస్ ఎమిరా కారు ఇప్పుడు కూడా పాత తరం డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. 400 hp సూపర్ ఛార్జ్డ్ V6 ఇంజన్‌తో, డ్రైవర్ నియంత్రణకు ఇది ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 1 కోటి.

మరోవైపు నిస్సాన్ Z NISMO పాత డిజైన్, కొత్త టెక్నాలజీ కలయికగా వచ్చింది. 420 hp పవర్‌తో, సూపర్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఇది ఆకట్టుకుంటుంది. దీని ధర సుమారు రూ. 90 లక్షలు.

66
బడ్జెట్ ధరలో స్పోర్ట్స్ కార్లు: టయోటా, మాజ్డా

తక్కువ బడ్జెట్‌లో స్పోర్ట్స్ కారు అనుభూతిని పొందాలనుకునే వారికి టయోటా GR86 యుజు ఎడిషన్ ఒక బెస్ట్ ఆప్షన్. కేవలం రూ. 40 లక్షల ధరలో లభించే ఈ కారు డ్రైవింగ్ బ్యాలెన్స్‌లో తనదైన ముద్ర వేసింది.

ఇక ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన రోడ్‌స్టర్ మాజ్డా MX-5 మియాటా. సింపుల్ డిజైన్, తక్కువ బరువు, అద్భుతమైన గేర్‌బాక్స్‌తో ఇది డ్రైవింగ్ లో కొత్త అనుభూతిని అందిస్తుంది. దీని ధర సుమారు రూ. 35 లక్షలు.

ఈ కార్లు కేవలం వేగాన్ని మాత్రమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ, పర్యావరణ హితమైన హైబ్రిడ్ ఇంజన్లను కూడా అందిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories