₹5.76 లక్షలకే 7 సీటర్ కార్.. మహీంద్రా, కియా బ్రాండ్లకు సవాల్

Published : Nov 08, 2025, 08:37 PM IST

 Renault Triber 2025 : కేవలం ₹5.76 లక్షల ప్రారంభ ధరతో రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ 2025 భారత మార్కెట్లో విడుదలైంది. కొత్త ఫీచర్లు, మెరుగైన సేఫ్టీతో MPV సెగ్మెంట్‌లో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తోంది.  

PREV
15
కొత్త రెనాల్ట్ ట్రైబర్ 2025: మార్కెట్లో సంచలన ఎంట్రీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో రెనాల్ట్ మరోసారి సంచలనం సృష్టించింది. కొత్తగా అప్‌డేట్ చేసిన రెనాల్ట్ ట్రైబర్ 2025 (Renault Triber Facelift) కేవలం ₹5,76,300 ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదలైంది. ఈ 7 సీటర్ MPV తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లు అందించడం ద్వారా మహీంద్రా, కియా వంటి బ్రాండ్లకు గట్టి పోటీగా నిలుస్తోంది. ట్రైబర్‌ను కుటుంబ వినియోగం, కమర్షియల్ ప్రయోజనాల కోసం రూపొందించారు.

25
రెనాల్ట్ ట్రైబర్ 2025: పవర్‌ట్రెయిన్, ఇంజిన్ వివరాలు

కొత్త ట్రైబర్‌లో మునుపటి మాదిరిగానే 1 లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. ఇది 72 హెచ్‌పీ పవర్, 96 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఈసారి రెనాల్ట్ మరింత శక్తివంతమైన ఇంజిన్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.

కంపెనీ సీఎన్జీ రిట్రోఫిట్‌మెంట్ ఆప్షన్ కూడా అందిస్తోంది, ఇది రెనాల్ట్ డీలర్‌షిప్‌లలో లభ్యం అవుతోంది. అయితే, దీని కోసం కస్టమర్లు అదనంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ సీఎన్జీ కిట్‌పై రెనాల్ట్ మూడు సంవత్సరాల వారంటీ ఇస్తోంది.

35
రెనాల్ట్ ట్రైబర్ 2025: ఆకర్షణీయమైన కొత్త డిజైన్

2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్‌లో చాలా మార్పులు చేసింది. ఇందులో కొత్త 2D రెనాల్ట్ లోగో, శక్తివంతమైన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ DRLs, ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ లైట్లు రాత్రిపూట ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయి.

కార్ ముందు భాగంలో రీడిజైన్ గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వెనుక భాగంలో బ్లాక్ ఫినిష్ టెయిల్ ల్యాంప్స్ కొత్త లుక్‌ను ఇస్తున్నాయి. మొత్తం డిజైన్ స్టైలిష్‌గా, స్పోర్టీగా ఉంది.

45
రెనాల్ట్ ట్రైబర్ 2025: ఇంటీరియర్, అప్‌డేట్ ఫీచర్లు

కొత్త ట్రైబర్‌లో కస్టమర్లకు ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు లభిస్తున్నాయి. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే,ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఉంది, ఇది మ్యూజిక్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జర్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డ్రైవర్ డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ అన్ని ఫీచర్లు ట్రైబర్‌ను తన సెగ్మెంట్‌లో అత్యంత సౌకర్యవంతమైన, టెక్-రిచ్ కార్‌గా నిలబెట్టాయి.

55
రెనాల్ట్ ట్రైబర్ 2025: సేఫ్టీ, ధర వివరాలు

భద్రతా అంశాలలో రెనాల్ట్ ఎటువంటి రాజీ పడలేదు. రెనాల్ట్ ట్రైబర్ 2025లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. అదనంగా EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) ఉండటం వల్ల బ్రేకింగ్ మరింత స్థిరంగా ఉంటుంది. రెనాల్ట్ ట్రైబర్ బిల్డ్ క్వాలిటీ బలంగా ఉండటంతో సేఫ్టీ స్థాయిలు మరింత పెరిగాయి.

ధర విషయానికి వస్తే, రెనాల్ట్ ట్రైబర్ 2025 ₹6.29 లక్షల వద్ద లాంచ్ చేశారు. కానీ, GST రీఫార్మ్ తరువాత ధర తగ్గి ప్రస్తుతం ఎక్స్‌షోరూమ్ ధర ₹5,76,300 మాత్రమే. ఈ ధరలో 7 సీటర్ MPV అందుబాటులో ఉండటంతో ఇది బడ్జెట్ ఫ్యామిలీ కార్ల మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా మారింది.

రెనాల్ట్ ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ 2025 తక్కువ ధర, కొత్త ఫీచర్లు, మెరుగైన సేఫ్టీతో భారత మార్కెట్లో మరోసారి బడ్జెట్ MPV సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలు సృష్టిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories