Maruti Suzuki: కొత్త కారు కొనేవారికి మారుతి సుజుకి అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ నెలలో నెక్సా, అరేనా మోడల్స్‌పై రూ. 2.15 లక్షల వరకు భారీ ఆఫర్లను ప్రకటిస్తూ కార్ల లవర్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం.
మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది నిజంగానే క్రేజీ న్యూస్.. ఇండియా లీడింగ్ కార్ మేకర్ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం జూన్ నెలలో కళ్ళు చెదిరే ఆఫర్లను తీసుకొచ్చింది. తన ప్రీమియం నెట్‌వర్క్ నెక్సా తో పాటు, మాస్ మార్కెట్ సిరీస్ అరేనా కార్లపై రూ. 2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లతో పాటు గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం స్పెషల్ బెనిఫిట్స్‌ను కూడా జూన్ 2 నుంచి జూన్ 30 వరకు అందుబాటులో ఉంచింది.
26
నెక్సా టాప్ మోడల్స్: ఇన్విక్టో, గ్రాండ్ విటారాపై భారీగా తగ్గిన ధరలు
జూన్ నెల ఆఫర్ల లిస్టులో నెక్సాకు చెందిన ప్రీమియం ఎమ్‌పీవీ ఇన్విక్టో రూ. 2.15 లక్షల వరకు బెనిఫిట్స్‌తో టాప్‌లో నిలిచింది. ఇకపోతే అందరి ఫేవరెట్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా పై కూడా ఆఫర్లు మామూలుగా లేవు. దీని ఎంట్రీ లెవెల్ సిగ్మా పెట్రోల్ వేరియంట్‌పై రూ. 1.35 లక్షలు, డెల్టా పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు ఉంది.
జీటా, ఆల్ఫా వేరియంట్లకు రూ. 85 వేల బెనిఫిట్స్‌తో పాటు 5 ఇయర్స్ కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఢిల్లీలో గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 1.85 లక్షల వరకు జీరో రోడ్ టాక్స్ బెనిఫిట్‌తో పాటు అదనంగా రూ. 90 వేల డిస్కౌంట్ లభిస్తుంది.
నెక్సా కార్లలో పాపులర్ అయిన బాలెనో పెట్రోల్, ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 40 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 35 వేల వరకు ఆఫర్లు ఉన్నాయి. ప్రొడక్షన్ ఆగిపోయిన ఇగ్నిస్ మోడల్ మిగిలివున్న డీలర్ స్టాక్‌పై రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
స్టైలిష్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై రూ. 25 వేలు, నార్మల్ పెట్రోల్, సీఎన్‌జీలపై రూ. 15 వేల తగ్గింపు ఉంది. లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ జిమ్నీ, XL6 మోడల్స్‌పై అన్ని వేరియంట్లకు రూ. 45 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.
అరేనా షోరూమ్ ఆఫర్స్: విక్టోరిస్, బ్రెజ్జా వేరియంట్లపై భారీ డిస్కౌంట్లు
ఇక అరేనా నెట్‌వర్క్ కార్ల విషయానికి వస్తే, ఫ్లాగ్‌షిప్ మోడల్ విక్టోరిస్ పై అత్యధిక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌పై రూ. 90 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 80 వేలు, పెట్రోల్ వేరియంట్‌పై రూ. 60 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. త్వరలోనే సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో రాబోతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ బ్రెజ్జా పెట్రోల్, సీఎన్‌జీ మోడల్స్ అన్నింటిపై రూ. 55 వేల వరకు భారీ తగ్గింపును అందిస్తున్నారు.
56
బడ్జెట్ కార్ల హంగామా: ఆల్టో, వాగన్ఆర్, స్విఫ్ట్‌లపై సూపర్ డిస్కౌంట్లు
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఇష్టపడే బడ్జెట్ కార్లపై కూడా మారుతి సుజుకి ఆఫర్ల వర్షం కురిపించింది.
• ఆల్టో K10: ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్‌పై రూ. 52,500.. మిగిలిన వేరియంట్లపై రూ. 42,500 వరకు ఆఫర్స్ ఉన్నాయి.
• వాగన్ఆర్: మోస్ట్ పాపులర్ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 52,500 వరకు తగ్గింపు.
• స్విఫ్ట్: కొత్త స్విఫ్ట్ మాన్యువల్, సీఎన్‌జీలపై రూ. 40 వేలు, ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ. 45 వేల బెనిఫిట్స్ ఉన్నాయి.
• S-ప్రెస్సో, సెలెరియో: పెట్రోల్, సీఎన్‌జీ మోడల్స్ రెండింటిపై రూ. 37,500 వరకు ఆఫర్లు ఉన్నాయి.
66
మీ లొకేషన్ లో ముందు చెక్ చేయండి
ఈ ధరలు, ఆఫర్లు అనేవి మీరు ఎంచుకునే లొకేషన్, వేరియంట్, స్టాక్ లభ్యతను బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు మీ దగ్గరలోని మారుతి సుజుకి లేదా నెక్సా డీలర్‌షిప్‌ను సంప్రదించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడం మంచిది. ప్రస్తుతం మారుతి అరేనా కార్ల ప్రారంభ ధర రూ. 3.70 లక్షలుగా ఉండగా, నెక్సా రేంజ్ రూ. 5.99 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 20.01 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.