Budget Car: దేశంలో అత్యంత చ‌వ‌కైన 7 సీట‌ర్ కారు ఇదే.. ఫీచ‌ర్లు కూడా సూప‌ర్

Published : May 25, 2026, 04:15 PM IST

Budget Car: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ 7 సీటర్ కార్లలో రెనాల్ట్ ట్రైబర్ ఒకటి. ఈ కారు తాజాగా 2026 మోడల్‌గా కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చింది. ప్రయాణికుల సౌకర్యం, భద్రత, డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేలా కొన్ని కీలక మార్పులు చేశారు 

PREV
15
ట్రైబర్ 2026 ధరలు ఎంత పెరిగాయి?

రెనాల్ట్ ట్రైబర్ 2026 మోడల్‌ను అథెంటిక్‌, ఎవాల్యుష‌న్‌, టెక్నో, మోష‌న్ అనే నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. కొత్త ధరల ప్రకారం ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి ప్రారంభమై రూ.8.48 లక్షల వరకు ఉంది.. గత మోడల్‌తో పోలిస్తే వేరియంట్‌ను బట్టి రూ.5,000 నుంచి రూ.9,000 వరకు ధర పెరిగింది. టాప్ ఎండ్ ఎమోష‌న్‌ వేరియంట్‌లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రత్యేక రంగు కోసం అదనంగా రూ.21,000 చెల్లించాల్సి ఉంటుంది. ధర పెంపు స్వల్పంగానే ఉన్నప్పటికీ, కొత్త ఫీచర్లు వినియోగదారులకు మరింత విలువను అందించేలా కంపెనీ ప్రయత్నించింది.

25
కొత్తగా జోడించిన ఫీచర్లు ఏమిటి?

2026 ట్రైబర్‌లో ప్రతి వేరియంట్‌కు కొన్ని అదనపు సౌకర్యాలను జోడించారు. ఎవాల్యుష‌న్‌ వేరియంట్‌లో స్టీరింగ్‌పై ఆడియో, ఫోన్ కంట్రోల్స్, డే-నైట్ అడ్జస్టబుల్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, రియర్ రూమ్ ల్యాంప్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. టెక్నో వేరియంట్‌లో డ్రైవర్ సీటుకు ఆర్మ్‌రెస్ట్, సీటు ఎత్తు సర్దుబాటు సదుపాయం, రియర్ డిఫాగర్, మూడో వరుస ప్రయాణికుల కోసం 12V సాకెట్, అదనపు ట్వీటర్లు, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్వీఎంలు వంటి ఫీచర్లు చేర్చారు. టాప్ వేరియంట్ అయిన ఎమోష‌న్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను అందించడం ద్వారా ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచారు.

35
ఇంటీరియర్, సీటింగ్ సౌకర్యాల్లో ప్రత్యేకత ఏంటి?

ట్రైబర్ ప్రధాన ఆకర్షణ దాని ఫ్లెక్సిబుల్ సీటింగ్ వ్యవస్థ. అవసరాన్ని బట్టి దీనిని 5 సీటర్, 6 సీటర్ లేదా 7 సీటర్‌గా మార్చుకునే వీలుంది. రెండో వరుస సీట్లు పూర్తిగా మడిచే విధంగా ఉండటంతో ఎక్కువ లగేజీని కూడా సులభంగా తీసుకెళ్లవచ్చు. క్యాబిన్‌లో డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. విస్తారమైన లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ కారణంగా దీర్ఘ ప్రయాణాల్లో కూడా ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించగలరు.

45
భద్రత విషయంలో ఎలా ఉంది?

రెనాల్ట్ ట్రైబర్‌లో భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ప్రయాణికుల రక్షణ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించారు. ఈ సదుపాయాలు అత్యవసర పరిస్థితుల్లో వాహన నియంత్రణను మెరుగుపరచడమే కాకుండా ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి. కుటుంబంతో ఎక్కువగా ప్రయాణించే వారికి ఇవి అదనపు భరోసాను కల్పిస్తాయి.

55
ఇంజిన్ పనితీరు, వారంటీ వివరాలు

కొత్త ట్రైబర్‌లో కూడా 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ 72 PS శక్తి, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అన్ని వేరియంట్లలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్‌లో AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక కూడా ఉంది. నగర ప్రయాణాలతో పాటు హైవే డ్రైవింగ్‌కు కూడా ఈ ఇంజిన్ సరిపోతుంది. కంపెనీ మూడు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ అందిస్తోంది. రెనాల్ట్ సెక్యూర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ వారంటీని ఏడు సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల కవరేజ్ అందించడం వల్ల వినియోగదారులకు మరింత నమ్మకం కలుగుతుంది. మొత్తంగా చూస్తే, స్వల్ప ధర పెంపుతో పాటు కొత్త ఫీచర్లు, మెరుగైన సౌకర్యాలు, భద్రతా అప్‌డేట్లను అందించిన రెనాల్ట్ ట్రైబ‌ర్‌ 2026 మోడల్, తక్కువ బడ్జెట్‌లో 7 సీటర్ కారు కొనాలనుకునే కుటుంబాలకు ఇప్పటికీ ఆకర్షణీయమైన ఎంపికగానే నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories