Cheapest Tesla EV India: ఇండియాలోకి టెస్లా చీపెస్ట్ ఈవీ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు!

Published : May 29, 2026, 09:16 PM IST

Cheapest Tesla EV India: టెస్లా భారత్‌లోకి చీపెస్ట్ ఈవీ కార్ ను తీసుకొచ్చింది. ఇతర టెస్లా కార్లతో పోలిస్తే తక్కువ ధరలోనే మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ ఈవీని లాంచ్ చేసింది. 15 నిమిషాల ఛార్జింగ్‌తో 238 కిమీ ప్రయాణించవచ్చు.

PREV
14
భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టెస్లా చీపెస్ట్ ఈవీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్

టెస్లా లవర్స్‌కు ఎలన్ మస్క్ కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఈవీ మార్కెట్‌ను షేక్ చేయడానికి తన మోస్ట్ అఫార్డబుల్ ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. సరికొత్త '2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్' (Model Y Premium Rear-Wheel Drive) కారును శుక్రవారం అధికారికంగా లాంచ్ చేసింది.

దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 50.89 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటివరకు ఇండియాలో టెస్లా రిలీజ్ చేసిన కార్లలో ఇదే అత్యంత తక్కువ ధర కావడం విశేషం. గతేడాది మోడల్ వైను రూ. 59.89 లక్షలకు, గత నెలలోనే ఆరు సీట్ల మోడల్ వైఎల్ ఎస్‌యూవీని రూ. 61.99 లక్షలకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ కార్లతో పోలిస్తే ఇది కాస్త తక్కువ ధర, బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాలి.

24
సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. 500 కిలోమీటర్ల రేంజ్

ఈ కొత్త టెస్లా మోడల్ వై కారులో ఛార్జింగ్ టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఇందులో 175 కిలోవాట్ల సూపర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కేవలం 15 నిమిషాలు ఛార్జ్ పెడితే చాలు, ఏకంగా 238 కిలోమీటర్ల దూరం హ్యాపీగా ప్రయాణించవచ్చు.

ఇక ఫుల్ ఛార్జ్ చేస్తే WLTP స్టాండర్డ్స్ ప్రకారం ఏకంగా 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. లాంగ్ రైడ్స్ వెళ్లేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. స్పీడ్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 5.9 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందుకుంటుంది. దీని డెలివరీలు ఈ ఏడాది జూలై నుంచి స్టార్ట్ కానున్నాయి.

34
ఫ్యూచరిస్టిక్ లుక్.. అదిరిపోయే ఇంటీరియర్

మార్చి 2026 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఈవీగా రికార్డు సృష్టించిన మోడల్ వై ప్లాట్‌ఫామ్‌పైనే దీనిని డిజైన్ చేశారు. సరికొత్త హార్డ్‌వేర్, లగ్జరీ ఇంటీరియర్‌తో ఈ వేరియంట్ లుక్ అదిరిపోయింది. కారు లోపల ఐదుగురు పెద్దలు చాలా కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు.

డ్యాష్‌బోర్డ్‌పై 16 అంగుళాల మెయిన్ టచ్‌స్క్రీన్, వెనుక సీట్లలో ఉన్నవారి కోసం 8 అంగుళాల రియర్ టచ్‌స్క్రీన్ ఇచ్చారు. కారు బరువు 1,928 కిలోలు కాగా, లగేజ్ కోసం ఏకంగా 2,138 లీటర్ల భారీ కార్గో స్పేస్ ఉంది. ఇండియా రోడ్లకు తగ్గట్టుగా 167 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, స్టైలిష్ 19 అంగుళాల వీల్స్‌తో ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే అందరి కళ్లూ దీనిపైనే పడటం ఖాయం.

44
ఇండియా మొత్తం ఛార్జింగ్ నెట్‌వర్క్ హడావుడి

కార్లను లాంచ్ చేయడమే కాదు, ఇండియాలో ఈవీ వాడకాన్ని సులభతరం చేయడానికి టెస్లా భారీ ప్లాన్స్ వేస్తోంది. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని, కస్టమర్ల కోసం రిటైల్ సెంటర్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్, ఛార్జింగ్ స్టేషన్లను భారీగా విస్తరిస్తున్నామని టెస్లా సీనియర్ డైరెక్టర్ ఇసబెల్ ఫాన్ తెలిపారు.

ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 'టెస్లా ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్' ఉన్నాయి. త్వరలోనే హైదరాబాద్, చెన్నై, పూణే, జైపూర్, చండీగఢ్ వంటి ప్రధాన సిటీల చుట్టూ సూపర్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను బిల్డ్ చేయనున్నారు. ఈ కారు బేసిక్ మోడల్‌పై 4 ఏళ్లు లేదా 80,000 కిమీ వారంటీ, అలాగే బ్యాటరీ, డ్రైవ్ యూనిట్‌పై ఏకంగా 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories