Best Range Electric SUVs in India 2026: పెట్రోల్, డీజిల్ కష్టాలకు గుడ్ బై చెప్పేయండి. భారత మార్కెట్లో అద్భుతమైన మైలేజీ ఇస్తూ దుమ్మురేపుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ SUVలు ఏవో మీకు తెలుసా? వీటితో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 682 కిమీ వరకు ప్రయాణించవచ్చు.
ఫుల్ ఛార్జ్ చేస్తే 680 కిమీల జర్నీ.. రేంజ్ విషయంలో ఈ 5 ఎలక్ట్రిక్ కార్లే కింగ్స్ !
భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాల హవానే నడుస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ కారు అనగానే అందరికీ వచ్చే మొదటి డౌట్ రేంజ్. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? అనేది. మీ టెన్షన్ తగ్గించడానికి, మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ రేంజ్ ఇచ్చే 5 ఎలక్ట్రిక్ SUVల వివరాలు గమనిస్తే..
25
రేంజ్ లో రారాజు: మహీంద్రా BE 6
మహీంద్రా నుంచి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేంజ్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు (59kWh, 79kWh) ఉన్నాయి. దీని పెద్ద బ్యాటరీ ప్యాక్ 286 hp పవర్, 380 Nm టార్క్ ఇస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇది ఏకంగా 682 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మీరు రోజువారీ అవసరాల కోసం వాడితే, వారం మొత్తం ఒక్క ఛార్జింగ్‌తో సరిపెట్టవచ్చు. దీని ఎక్స్ షోరూమ్ ధర ₹18.90 లక్షల నుంచి ₹28.49 లక్షల మధ్య ఉంది.
35
మారుతి సుజుకి ఈ విటారా
మారుతి సుజుకి నుంచి వస్తున్న ఈ కారు కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేశారు. ఇది 49kWh, 61kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో బీవైడీ తయారు చేసిన బ్లేడ్ సెల్ ఎల్ఎఫ్ పీ బ్యాటరీలను వాడారు. దీని పెద్ద బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర సుమారు ₹15.99 లక్షల నుండి ₹20.01 లక్షల వరకు వుంటుంది.
టాటా మోటార్స్ నుండి వస్తున్న మోస్ట్ పాపులర్ ఎలక్ట్రిక్ కార్లలో హారియర్ ఈవీ ఒకటి. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, పర్ఫార్మెన్స్‌లో కూడా తోపు. ఇందులో 75kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది రియర్ వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఇది 627 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర ₹21.49 లక్షల నుంచి ₹30.23 లక్షల వరకు ఉంటుంది.
55
దమ్మున్న మహీంద్రా XEV 9e
మహీంద్రా కంపెనీ మరో పవర్‌ఫుల్ ఎస్‌యూవీని కూడా మార్కెట్లోకి తెచ్చింది. అదే XEV 9e. ఇందులో ఏకంగా మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు (59kWh, 70kWh, 79kWh) ఉన్నాయి. దీని పెద్ద బ్యాటరీ ద్వారా 286hp పవర్ లభిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 679 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర ₹19.95 లక్షల నుంచి మొదలై ₹29.45 లక్షల వరకు ఉంటుంది. లాంగ్ జర్నీలు చేసే వారికి మహీంద్రా XEV 9E ఒక బెస్ట్ ఆప్షన్.