కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఆటోమేటిక్ vs మాన్యువల్.. ఏది బెస్ట్?

Published : Nov 08, 2025, 09:59 PM ISTUpdated : Nov 08, 2025, 10:11 PM IST

Pros And Cons Of Automatic Car: ఆటోమేటిక్ కార్లు డ్రైవింగ్ సౌలభ్యం, కంఫర్ట్ కల్పించినా, ఖర్చు ఎక్కువగా ఉండటం మరింత భారం కానుంది. అలాగే, కంట్రోల్ పరంగా కొంత వెనుకబడి ఉంటాయి. ఆటోమేటిక్ కార్ల లాభాలు, నష్టాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఆటోమేటిక్ కార్లు అంటే ఏమిటి?

నేటి పట్టణ జీవనశైలిలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమేటిక్ కార్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. క్లచ్ లేదా గేర్ మార్పులు లేకుండా కేవలం యాక్సిలరేటర్, బ్రేక్ ఉపయోగించి డ్రైవ్ చేయగల సౌలభ్యం ఇవి కల్పిస్తాయి. మాన్యువల్ కార్లతో పోలిస్తే వీటిని నడపడం తేలికగా ఉంటుంది. అయితే, కొనుగోలు చేసే ముందు లాభాలు, నష్టాలు రెండింటినీ తెలుసుకోవడం ముఖ్యం.

25
ఆటోమేటిక్ కార్ల 4 ప్రధాన లాభాలు

1. డ్రైవింగ్ సౌలభ్యం

క్లచ్ లేదా గేర్ మార్పుల అవసరం లేకపోవడం వల్ల డ్రైవింగ్ చాలా సులభంగా ఉంటుంది. ట్రాఫిక్‌లో గంటల తరబడి డ్రైవ్ చేసినా పెద్దగా అలసట అనిపించదు.

2. స్మూత్ డ్రైవింగ్ అనుభవం

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్వయంగా గేర్ మార్చుతుండటంతో డ్రైవింగ్ మరింత సాఫీగా ఉంటుంది. దీని వలన ప్రయాణం అంతరాయం లేకుండా సాగుతుంది.

3. బిగినర్స్‌కు అనుకూలం

డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఆటోమేటిక్ కార్లు చాలా సులభం. గేర్ మార్చడం, క్లచ్ నియంత్రణ వంటి పనులు అవసరం లేకపోవడం వల్ల రోడ్డు పై మరింత దృష్టి పెట్టవచ్చు.

4. డ్రైవర్ అలసట తగ్గుతుంది

రోజువారీ ఆఫీస్ ట్రిప్స్ లేదా లాంగ్ డ్రైవ్స్‌లో క్లచ్ ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడంతో కాళ్లు, మోకాలిపై ఒత్తిడి తగ్గుతుంది. దీని వలన డ్రైవర్ తక్కువగా అలసిపోతాడు.

35
ఆటోమేటిక్ కార్ల 3 ప్రధాన నష్టాలు

1. అధిక కొనుగోలు ధర

మాన్యువల్ కార్లతో పోలిస్తే ఆటోమేటిక్ వెర్షన్లు ఎక్కువ ఖరీదుగా ఉంటాయి. అధునాతన గేర్‌బాక్స్ టెక్నాలజీ కారణంగా ప్రారంభ ఖర్చు పెరుగుతుంది.

2. మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరమ్మత్తులు, సర్వీసింగ్ ఖరీదైనవిగా ఉంటాయి. దీర్ఘకాలిక నిర్వహణ వ్యయం మాన్యువల్ వాహనాల కంటే ఎక్కువగా ఉంటుంది.

3. డ్రైవింగ్ కంట్రోల్ తగ్గిపోవడం

మాన్యువల్ డ్రైవింగ్‌లో డ్రైవర్‌కి గేర్ ఎంపికలో పూర్తి నియంత్రణ ఉంటుంది. కానీ ఆటోమేటిక్‌ కార్లలో అది వుండదు. కాబట్టి స్పోర్ట్స్ డ్రైవింగ్ లవర్స్ కు ఇది కొంత నిరుత్సాహం కలిగిస్తుంది.

45
ఆటోమేటిక్ వర్సెస్ మాన్యువల్ కార్లు

ఆటోమేటిక్ కార్ లో డ్రైవింగ్ సౌలభ్యం ఎక్కువగా వుండగా, మాన్యువల్ కారులో తక్కువగా ఉంటుంది.

ఆటోమేటిక్ కారులో ట్రాఫిక్‌లో కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు & మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి.

మన్యువల్ కారులో డ్రైవర్ కంట్రోల్ ఎక్కువగా ఉండగా, ఆటోమేటిక్ కారులో తక్కువగా ఉంటుంది. డ్రైవింగ్ ఎంజాయ్‌మెంట్ తక్కుగా ఉంటుంది.

ఇటీవల వచ్చిన ఆటోమేటిక్ మోడళ్లలో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మాన్యువల్ వాహనాల స్థాయికి చేరుకుంది.

55
కొనుగోలు ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
  1. బడ్జెట్: ఆటోమేటిక్ కార్ల ధర, సర్వీసింగ్ ఖర్చులు మాన్యువల్ కంటే ఎక్కువగా ఉంటాయి.
  2. డ్రైవింగ్ అవసరాలు: నగరల ట్రాఫిక్‌లో డ్రైవింగ్ ఎక్కువైతే ఆటోమేటిక్ అనుకూలం.
  3. టెస్ట్ డ్రైవ్ చేయండి: రెండు రకాల కార్లను డ్రైవ్ చేసి తేడా తెలుసుకోవడం మంచిది.
  4. భవిష్యత్ రీసేల్ విలువ: ఆటోమేటిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో రీసేల్ విలువ కూడా మంచి స్థాయిలో ఉంటుంది.

ఆటోమేటిక్ కార్లు డ్రైవింగ్ సౌలభ్యం, ట్రాఫిక్‌లో కంఫర్ట్ కోరుకునే వారికి సరైన ఎంపిక.

Read more Photos on
click me!

Recommended Stories