Sainik School Admission 2026 : వచ్చే విద్యాసంవత్సరంలో మీ పిల్లలను కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైనిక్ స్కూల్లో వేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే చివరి అవకాశం.
భారత సాయుధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) లో చేరాలనుకునే విద్యార్థులకు సైనిక్ స్కూల్స్ మొదటి మెట్టు. ఇందులో విద్యార్థులను భారత ఆర్మీలో ఉద్యోగాలు పొందేలా క్రమశిక్షణ, దేశభక్తితో కూడిన విద్యాబ్యాసం, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఈ విద్యాసంస్థల్లో ప్రవేశంకోసం ప్రత్యేకంగా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది.
25
సైనిక్ స్కూల్ దరఖాస్తుకు చివరి అవకాశం
ఐదో తరగతి లేదా ఎనిమిదో తరగతి పూర్తయిన విద్యార్థులు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ All India Sainik School Entrance Exam (AISSEE) రాయవచ్చు. అంటే 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. 2026 విద్యాసంవత్సరానికిగాను ప్రస్తుతం విద్యార్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తోంది సైనిక్ స్కూల్ సొసైటీ... దరఖాస్తులకు అక్టోబర్ 30 (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. కాబట్టి మీ పిల్లలను సైనిక్ స్కూల్లో చేర్చాలనుకుంటే వెంటనే అప్లై చేసుకొండి,
35
AISSEE పరీక్షా విధానం
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష (AISSEE) పెన్ అండ్ పేపర్ (OMR) విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో (Multiple Choice Question) ఉంటుంది. 6, 9వ తరగతి ప్రవేశానికి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.. 180 నిమిషాల పాటు పరీక్ష జరుగుతుంది.
సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాల కోసం జరిగే AISSEE పరీక్ష ప్రాంతీయ బాషల్లో కూడా ఉంటుంది. అయితే కేవలం 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష మాత్రమే 13 భాషల్లో ఉంటుంది... 9వ తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష ఇంగ్లీషులో మాత్రమే జరుగుతుంది. ఫలితాలు ఫిబ్రవరి 2026లో వెలువడే అవకాశాలున్నాయి.
సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ టెస్ట్ దరఖాస్తు ఫీజు ఎంత?
AISSEE ప్రవేశ పరీక్ష దరఖాస్తు ఫీజు జనరల్, ఓబిసి, డిఫెన్స్, మాజీ సైనికోద్యోగుల కేటగిరీకి రూ. 850 ఉంటుంది. ఇక ఎస్సి, ఎస్టి, కేటగిరీలకు రూ. 700 ఉంటుంది. 6వ తరగతి ప్రవేశానికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
55
కొత్తగా 35 సైనిక్ స్కూల్స్
సైనిక్ స్కూల్స్ CBSE అనుబంధ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు. ఇక్కడి విద్యార్థులు NDA, ఇండియన్ నావల్ అకాడమీ వంటి వాటికి సిద్ధమవుతారు. రక్షణ మంత్రిత్వ శాఖ కొత్తగా 35 సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.