చదువు కంటే కమ్యూనికేషన్ స్కిల్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది లేకే చాలా మంది ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. ఇంటర్వ్యూలో మార్కుల కంటే మీ ఆలోచనలను ఎంత స్పష్టంగా వ్యక్తపరిచారో అన్నదే ప్రాధాన్యం.
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో, ఎక్కువగా రీల్స్, షార్ట్ వీడియోలు, మెసేజీల్లో మునిగిపోతున్నారు. అందువల్ల, వాస్తవ జీవితంలో సంభాషణకు వస్తే చాలా మందికి భయమేస్తోంది. ముందున్న వ్యక్తి మాట్లాడుతుంటే, మనం తడబడి పదాలు దొరకక ఇబ్బందిపడతాం. ఇది ఇంటర్వ్యూలో నెగటివ్ ఇంప్రెషన్ కలిగిస్తుంది. అందుకే మాటలలో స్పష్టత, నమ్మకం, బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం.
25
Thank You for Smoking – మాటల మంత్రం
ఈ సినిమా ఒక తంబాకూ కంపెనీ లాబీయిస్ట్ అయిన నిక్ నైలర్ కథ. తన మాటలతోనే ఎలా అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తాడో చూపిస్తుంది. వాదనను ఎలా సమర్ధవంతంగా వినిపించాలి, బాడీ లాంగ్వేజ్, వాయిస్ టోన్ ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఈ సినిమాతో నేర్చుకోవచ్చు. మాటల శక్తిని అర్థం చేసుకోవాలంటే ఇది తప్పక చూడాల్సిన సినిమా.
35
Yes Man – పాజిటివ్ వైఖరి ప్రాధాన్యం
జిమ్ క్యారీ నటించిన ఈ కామెడీ చిత్రం, “యస్ చెప్పడం ద్వారా కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో” చూపిస్తుంది. ఇంటర్వ్యూలో పాజిటివ్ అటిట్యూడ్ ఎంత ముఖ్యం, ఇతరులు చెప్పే మాటలను శ్రద్ధగా వినడం ఎందుకు అవసరం, కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం ఎలా విజయానికి దారి తీస్తుందో నేర్పిస్తుంది.
ఎడ్డి మర్ఫీ నటించిన ఈ సినిమా, ఒక మాటే కొన్ని సార్లు పెద్ద వాక్యాల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుందని చెబుతుంది. ఇంటర్వ్యూలో మాటల క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అని గుర్తుచేస్తుంది. బాడీ లాంగ్వేజ్, హావభావాలు కూడా సంభాషణలో కీలక పాత్ర వహిస్తాయని ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది.
55
Suckers – కస్టమర్‌ని ఎలా ఒప్పించాలి?
ఈ సినిమా కార్ల విక్రయాల చుట్టూ తిరుగుతుంది. కస్టమర్ మన మాటల వల్ల ఎలా ప్రభావితమవుతాడో చూపిస్తుంది. వేరువేరు వ్యక్తిత్వాలకు ఎలా తగిన విధంగా మాట్లాడాలి, వారి అవసరాలను ఎలా అర్థం చేసుకోవాలి అన్నదానిపై స్పష్టత ఇస్తుంది. సేల్స్, మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి ఇది చాలా ఉపయోగకరమైన సినిమా.