Zomato: జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ చేసిన ఒక్క ప్రకటనతో ఆయనకు ఏకంగా 8000 మెయిల్స్ వచ్చాయి. గతంలో తనతో ఉద్యోగం చేసిన వారికి మళ్లీ తన కంపెనీలో జాబ్ చేసే అవకాశాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. దీనికి వేల మంది స్పందించారు.
జొమాటో ఓనర్ దీపిందర్ గోయల్ ఎవరూ చేయని పనిచేశాడు. ఆ పనికి అతను ఊహించని విధంగా స్పందన వచ్చింది. ఆయన చేసిన ప్రకటన వ్యాపార ప్రపంచంలో, ముఖ్యంగా స్టార్టప్ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. తన కంపెనీలో గతంలో పనిచేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులు తిరిగి రావాలని ఆయన సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఈమెయిల్ ఐడీని కూడా కూడా షేర్ చేశారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల్లోనే భారీ స్పందన వచ్చింది. కేవలం ఒక వారం రోజుల్లో దాదాపు 8,000 ఈమెయిల్స్ వచ్చాయని సమాచారం. అన్ని మెయిల్స్ రావడం చూసి తానే ఆశ్చర్యపోయినట్లు దీపిందర్ గోయల్ చెప్పారు.
24
నాలుగు వేల మాజీ ఉద్యోగులు
వచ్చిన ఈమెయిల్స్‌లో సుమారు 4,000 మంది మాజీ ఉద్యోగులవి ఉన్నాయి. ఇక మిగిలిన 4,000 మంది కొత్తగా కంపెనీలో చేరాలని ఆసక్తి చూపిన వారు ఉన్నట్టు దీపిందర్ గోయల్ తెలిపారు.ముఖ్యంగా పాత ఉద్యోగులు పంపిన ఈమెయిల్స్ చదువుతూ ఉంటే ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాయని ఆయన అన్నారు. వారు కంపెనీ ఎదుగుదల రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు, కలిసి పనిచేసిన అనుభవాలు, ఆ రోజుల జ్ఞాపకాలను వివరంగా రాశారని.. అవి చదువుతుంటే ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఈ మెయిల్స్ చదివినప్పుడు కంపెనీ ప్రారంభ దశలో జరిగిన అనేక విషయాలు మళ్లీ గుర్తొస్తున్నాయని ఆయన అన్నారు.
34
తానే స్వయంగా చదువుతూ
అంత పెద్ద సంఖ్యలో ఈమెయిల్స్ రావడంతో వాటన్నింటినీ చదవడం చాలా కష్టంగా మారిందని దీపిందర్ గోయల్ చెప్పారు. కొన్ని మెయిల్స్‌లో ఉన్న విషయాలను తన హెచ్ఆర్ టీమ్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతోందని, అందుకే తానే చాలా మెయిల్స్‌ను స్వయంగా చదువుతున్నానని చెప్పారు. అంతేకాకుండా గతంలో నేరుగా తనతో కలిసి పనిచేసిన వారు మెయిల్ రిప్లై కోసం ఎదురుచూడవద్దని... తన ఫోన్ నంబర్ వెతికి నేరుగా వాట్సాప్‌లో మెసేజ్ చేయాలని కూడా ఆయన సూచించారు. ఒక పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడు ఇలా ఓపెన్‌గా చెప్పడం సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
దీపిందర్ గోయెల్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తూ స్పందించగా, మరికొందరు దీపిందర్ గోయల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్టప్ రంగంలో లేఆఫ్స్ జరుగుతున్న ఈ సమయంలో పాత ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి ఆహ్వానించడం మంచి సంకేతమేనని చెబుతున్నారు. కంపెనీతో అనుబంధం ఉన్నవారిని గౌరవించడం, వారి అనుభవాన్ని మళ్లీ ఉపయోగించుకోవాలనుకోవడం మంచి నిర్ణయం అని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈమెయిల్స్ పంపిన ఎంత మందికి ఉద్యోగం దక్కుతుందో చూడాలి.