స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో హాయిగా ట్రావెల్ చేయండిలా.. ఈ ఆప్షన్ ఓ సారి ట్రై చేయండి..

Published : Feb 12, 2026, 12:19 PM IST

Indian Railways: ఏదైనా టూర్ లేదా సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా.? రైలు టికెట్ బుక్ చేసుకున్నారా.? అయితే మీకో అదిరిపోయే ఫీచర్ గురించి చెప్పబోతున్నాం. స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా.! 

PREV
15
ట్రైన్ జర్నీలో స్లీపర్ టికెట్

మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీలో స్లీపర్ టికెట్ తో ఏసీలో ప్రయాణించాలని అనుకున్నారా.? మరి ఎక్కువ డబ్బులు చెల్లించకుండానే స్లీపర్ క్లాస్ డబ్బులతో ఏసీలో ప్రయాణించవచ్చు. అదెలాగంటే.? రైలు టికెట్ బుక్ చేసుకునప్పుడు.. ఆటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో రిజర్వేషన్ టికెట్లను పద్దతి ప్రకారం.. ప్రయాణికులు ఎంచుకున్న కోచ్‌లోనే బెర్త్ లభించేది.

25
టికెట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్

ఒకవేళ ఆ బోగీలో బెర్త్ లేకపోతే టికెట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు.. ఈ ఫీచర్ ద్వారా ప్రయాణికులకు తాము ఎంచుకున్న కోచ్‌లో బెర్త్ దొరక్కపోతే.. వారికి అంతకంటే హయ్యస్ట్ కోచ్‌లో సీట్ లభిస్తుంది. కానీ ఇది జరగాలంటే ఆ బోగీలో కచ్చితంగా సీటు ఖాళీగా ఉండాలి. దీనికి ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

35
అటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్

ఉదాహరణకు ఈ అటో అప్‌గ్రేడేషన్ ఆప్షన్ ద్వారా ఓ ప్రయాణికుడు స్లీపర్ క్లాసులో టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే.. ఆ బోగీలో బెర్త్ ఖాళీ లేకపోతే.. అతడికి థర్డ్ ఏసీలో ఖాళీగా ఉన్న బెర్త్ లభించే ఛాన్స్ ఉంది. ఒక్క స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు మాత్రమే కాదు.. ఈ ఆప్షన్ ద్వారా థర్డ్ ఏసీ వారికి.. సెకండ్ ఏసీ, సెకండ్ ఏసీ వారికి ఫస్ట్ ఏసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

45
కేవలం హయ్యర్ కోచ్‌ల్లో

అయితే ఈ సౌకర్యం కేవలం హయ్యర్ కోచ్‌ల్లో సీట్లు అందుబాటులో ఉన్నప్పుడే లభిస్తుంది. కాగా, ఈ ఆప్షన్ ఎంచుకున్న చాలామంది స్లీపర్ క్లాస్ రైలు టికెట్లతో థర్డ్ ఏసీలో ప్రయాణించారు. ఇది కేవలం ఆన్‌లైన్ ద్వారా ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకున్నవారికి మాత్రమే.. కౌంటర్లలో బుక్ చేసుకునేవారికి ఈ ఫీచర్ పనిచేయదు.

55
ఈ ఆప్షన్ మీరు కూడా..

మరి ఒకసారి ఈ ఆప్షన్ మీరు కూడా ట్రై చేయండి.. మీకు కూడా అలా స్లీపర్ క్లాస్ టికెట్ తో ఏసీ బెర్త్ వచ్చిందంటే.. హాయిగా తక్కువ డబ్బులకే చల్ల.. చల్లగా ఏసీ ప్రయాణాన్ని మీరు చేయవచ్చు. ఈ ఆప్షన్ ఎప్పటి నుంచో అమలులో ఉన్నప్పటికీ చాలామందికి ఇది ఎలా ఉపయోగించాలో తెలియదు.

Read more Photos on
click me!

Recommended Stories