ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్ సంపాదించడానికి ఒక ముఖ్యమైన మార్గంగా మారింది. వీడియోలు చేస్తూ చాలామంది డబ్బులు పోగేసుకుంటున్నారు. కొందరు ఫన్నీ కంటెంట్ చేస్తుంటే, మరికొందరు వీడియోలు చేసి అవసరమైన సమాచారాన్ని పంచుకుంటున్నారు.
చాలామంది సోషల్ మీడియాలో తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు. అలా చూపిస్తూ వేలల్లో డబ్బు సంపాదిస్తున్నారు. ఒక యూట్యూబర్ నెలకి ఎంత సంపాదిస్తారని అందరి మనస్సులో ఒకటే ప్రశ్న మెదులుతోంది?
ప్రతిరోజు 10 నుండి 5 వరకు డ్యూటీ చేసి మనమందరం అలసిపోతున్నాం. ఈ ఒకే విధమైన జీవితంతో చాలామంది విసిగిపోతున్నారు. అలాంటి వాళ్లు తమకున్న క్రియేటివిటీ చూపించి యూట్యూబ్ ద్వారా పెద్దమొత్తంలో ఆదాయం సంపాదించుకోవచ్చు.
ఒక నివేదిక ప్రకారం, ఒక యూట్యూబర్ నెలవారీ సగటు సంపాదన ₹25,000 వరకు ఉండవచ్చు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యూట్యూబర్, లక్ష సబ్‌స్క్రైబర్లు దాటినవారు ₹15,000 నుండి ₹30,000 వరకు సంపాదించవచ్చు.
ఎవరి సబ్‌స్క్రైబర్లు 5 లక్షలు దాటారో, వారు ₹50,000 నుండి ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. సబ్‌స్క్రైబర్ల సంఖ్య 10 లక్షలు దాటితే, నెలకి ₹2 లక్షల నుండి ₹5 లక్షల వరకు సంపాదిస్తున్నవారూ ఉన్నారు. అయితే వీడియోలకు ఎంత తక్కువ సమయంలో అన్ని ఎక్కువ వీక్షణలు వచ్చినవారు, ఎక్కువ లైక్స్, కామెంట్లు వచ్చినవారు అత్యధికంగా సంపాదిస్తున్నారు.