మంచి బైక్, కాస్లీ ఫోన్, స్టైలిష్ దుస్తులు.. ఇదీ యువత ఆలోచించే విధానం. ఇందుకోసం అప్పులు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ ఆలోచన మారుతోంది. అప్పు చేసి పప్పు కూడు మాకొద్దని అంటున్నారు.
“అప్పు చేసి పప్పుకూడు తినొద్దు” అనే ప్రసిద్ధ సామెతను ఇప్పుడు నిజంగానే భారతీయ యువత అనుసరిస్తోంది. మితిమీరిన ఖర్చులు, అవసరం లేని వస్తువుల కొనుగోలు తగ్గిపోగా, ఇప్పటికే ఉన్న డబ్బును మదుపు చేయడంపై దృష్టిసారిస్తున్నారు.
తప్పనిసరి అవసరాలైతే మాత్రమే, ముఖ్యంగా స్థిరాస్తులు లేదా చరాస్తుల కోసం అప్పు తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ వినియోగ వస్తువుల కొరకు అప్పు తీసుకోవడం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అవసరం లేకపోయినా అప్పులు తీసుకోని ఈఎమ్ఐలు చెల్లించే విధానానికి యువత స్వస్తి చెబుతోంది.
25
పడిపోయిన రిటైల్ రుణ వృద్ధిరేటు
ట్రాన్స్‌యూనియన్ CIBIL నివేదిక ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారతదేశంలో రిటైల్ రుణాల వృద్ధిరేటు 12% వద్ద ఉండగా, అదే సంవత్సరంలో 2024-25 చివరి త్రైమాసికంలో అది గణనీయంగా 5 శాతానికి పడిపోయింది.
క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాలు, కన్ఫ్యూమర్ డ్యూరబుల్ లాంటి విభాగాల్లో ఈ తగ్గుదల ఎక్కువగా కనిపించింది. ఇది వినియోగదారులు పొదుపు వైపు మొగ్గు చూపిస్తున్నారన్న దానికి సంకేతంగా చెబుతున్నారు.
35
తగ్గిన పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ రుణాలు
క్రెడిట్ కార్డు రుణాలు "జీరో నుంచి -32%" దాకా పడిపోయాయి. మరోవైపు, వ్యక్తిగత రుణాల వృద్ధివార్యం 13%- నుంచి 6% వద్దకు తగ్గింది. ఖర్చులను తగ్గించి పొదుపు వైపు మొగ్గు చూపుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి.
కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలు తగ్గాయి
టెలివిజన్, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాంటి వినియోగ వస్తువుల కొరకు తీసుకునే రుణాల సంఖ్య 19% నుంచి 6%కి పడిపోయింది. నిరుద్యోగత, మార్కెట్ అనిశ్చితీ కూడా ఇందుకు కారణంగా చెబుతున్నారు.
క్రెడిట్ యాక్టివ్ వినియోగదారులు 15% నుంచి 8%దాకా తగ్గారు. కొత్తగా రుణాలు తీసుకునే వారి వృద్ధిరేటు: 19 శాతం నుండి 16 శాతానికి తగ్గింది. అనవసరమైన ఖర్చులకు క్రెడిట్ కార్డును ఉపయోగించే వారి సంఖ్య తగ్గినట్లు గణంకాలు చెబుతున్నాయి.
55
హోమ్ లోన్ మరింత తగ్గుముఖం
ఇప్పటి గణాంకాల ప్రకారం, గృహ రుణాల వృద్ధి 5% నుంచి -7%కి తగ్గింది. అయితే రూ. కోటిపైగా రుణాలు మాత్రం తొమ్మిది శాతం పెరగడం గమనార్హం. ఇది సంపన్నులు, పెద్ద వ్యాపారాలు రుణాలు తీసుకోవడంలో పెరుగుదలను సూచిస్తుంది. కాగా గ్రామీణ రుణాలు 20 శాతం నుండి 22 శాతానికి పెరిగాయి.
సెమీ అర్బన్ ప్రాంత రుణాల వృద్ధి 29 శాతం నుండి 30 శాతానికి పెరిగింది. ఈ గణాంకాలు భారతదేశంలో వినియోగదారుల రుణ ప్రవర్తనలో ఒక స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. యువతలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతున్నదని, అలాగే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రుణ అవసరాలు పెరుగుతున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది.