వర్షాకాలం కచ్చితంగా అవసరమయ్యే వాటిలో గొడుగులు ఒకటి. మాన్సూన్‌లో మహిళలు, పురుషులు, విద్యార్థులు ఇలా ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడతాయి. హోల్‌సేల్‌లో గొడుగులను ఒక్కోదాన్ని రూ. 100 నుంచి రూ. 120కి కొనుగోలు చేయొచ్చు.
వీటిని సగటును రూ. 200 నుంచి రూ. 300 వరకు విక్రయించవచ్చు. ఇలా చూసుకుంటే ఒక్క గొడుగుకు రూ. 100 నుంచి రూ. 150 లాభం పొందొచ్చు. బస్సు స్టాండ్, స్కూల్స్ దగ్గర, రైల్వే స్టేషన్లు, మార్కెట్ల వద్ద విక్రయించవచ్చు. ఎలాంటి రెంట్ లేకుండా వ్యాపారం చేయొచ్చు.