Gold Buying: బంగారం ధర ఎంతున్నా పెళ్లిళ్ల సమయంలో కొనకతప్పదు. అయితే 2026 నుంచి నియమాలు మారుతున్నాయి. చేతిలో డబ్బులు పట్టుకుని లేదా అకౌంట్‌లో డబ్బుంది కదా అని బంగారం కొనడానికి వెళ్తే కుదరదు. ఎక్కువ బంగారం కొంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు చూపించాల్సిందే.
మనదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులకు బంగారం కొనడం చాలా కష్టంగా మారింది. అయితే పెళ్లిళ్ల సమయంలో అప్పు చేసైనా బంగారాన్ని కొనాల్సిందే. కానీ ఇకపై నియమాలు మారుతున్నాయి. బంగారం కొనేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే, డబ్బున్నా బంగారం కొనలేరు.
25
ఎంత బంగారం కొంటే ఫ్రూఫ్ చూపించాలి?
బంగారం కొనేటప్పుడు కొత్త ఏడాదిలో కొన్ని నియమాలు పాటించాలి. మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం కొంటే కచ్చితంగా పాన్, ఆధార్ కార్డుల జెరాక్స్ లు సమర్పించాలి. అవి ఇవ్వకుండా బంగారం కొనలేరు. మీరు నగదు చెల్లింపు ఏ రూపంలో చేసినా ఫర్వాలేదు కానీ ప్రూఫ్ మాత్రం చూపించాల్సిందే.
35
రెండు లక్షల రూపాయల వరకే
మీరు ఎలాంటి ప్రూఫ్ ఇవ్వకుండా బంగారం కొనాలనుకుంటే ఆ బంగారం ఖరీదు రెండు లక్షల రూపాయలు మించకుండా చూసుకోండి. అయితే ఒక రోజులో రూ. 2 లక్షల నగదు మించి కొనకూడదు. డిజిటల్ పేమెంట్ అయితే ద్వారా ఎక్కువ కొనొచ్చు. రూ. 2 లక్షల నగదు కొనుగోలుకు కూడా ఆధార్, పాన్ కార్డులు తప్పనిసరి.
బంగారం కొనేటప్పుడు జీఎస్టీ చెల్లించాల్సిందే. బంగారం విలువపై 3 శాతం, మేకింగ్ ఛార్జీలపై 5 శాతం జీఎస్టీని చెల్లించాలి. ఉదాహరణకు, రూ.1 లక్ష బంగారం, రూ.10,000 మేకింగ్ ఛార్జీలు అయితే, మొత్తం రూ.3,500 జీఎస్టీ అవుతుంది.
55
బంగారం కొనేటప్పుడు జాగ్రత్త
బంగారం కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు బిల్లు (డిజిటల్/ప్రింటెడ్) భద్రంగా ఉంచుకోవాలి. హాల్‌మార్క్ ఉన్న బంగారం చూసి కొనండి. పండుగ ఆఫర్లప్పుడు కొంటే ధర కొంచెం తక్కువగా ఉంటుంది.