Train Ticket: భారతీయ రైల్వే గుడ్ న్యూస్.. రైలు టికెట్ కన్ఫర్మ్ అయినా కూడా మీ జర్నీ తేదీని మార్చుకోవచ్చు

Published : Oct 08, 2025, 07:12 PM IST

దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఎంతో మంది రైలు టికెట్ (Train Ticket) బుక్ చేసుకుంటారు. టిక్కెట్ కన్ఫామ్ అయ్యాక జర్నీ తేదీని మార్చుకోవడానికి వీలు కాదు. కానీ వచ్చే ఏడాది జనవరి నుంచి టిక్కెట్ కన్ఫామ్ అయ్యాక కూడ మీ జర్నీ తేదీని మార్చుకోవచ్చు.

PREV
14
భారతీయ రైల్వే గుడ్ న్యూస్

భారతదేశంలో భారతీయ రైల్వే వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇవి ఎంతో సౌకర్యవంతంగా, అలసట లేని ప్రయాణాన్ని అందిస్తాయి. ప్రతిరోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటారు. ఒక్కోసారి అనివార్య కారణాల వల్ల ప్రయాణ తేదీని మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇప్పటి వరకు ముందుగానే బుక్ చేసుకున్న టిక్కెట్ తేదీని మార్చుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. త్వరలో మీకు బుక్ చేసుకున్న టికెట్ తేదీని మార్చుకోవచ్చు.

24
టికెట్ తేదీని మార్చవచ్చు

రైల్వేలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం  ప్రయాణికులు తమ ప్రయాణ తేదీని మార్చుకోలేరు.  టికెట్‌ను రద్దు చేసుకుని కొత్త టికెట్‌ను బుక్ చేసుకోవడం ఒక్కటే దారి. నేరుగా బుక్ చేసిన టికెట్లపై ఉన్న తేదీని మార్చడం కుదరదు.  అయితే ఇప్పుడు ఈ నియమం మారబోతోంది.  వచ్చే ఏడాది జనవరి నుంచి కన్ఫర్మ్ అయిన రైలు టికెట్ల ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండానే  మార్చుకోవచ్చని భారతీయ రైల్వే తెలిపింది.

34
ఇది నిజంగా గుడ్ న్యూస్

ప్రయాణ తేదీని మార్చుకోవడం సులువే. అయితే మీరు మార్చుకున్న కొత్త తేదీలో కన్ఫర్మ్ బెర్త్ దొరుకుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఎందుకంటే మీరు మార్చుకున్న తేదీలో రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తులను బట్టి  మీకు బెర్తు లభిస్తుంది. అంతేకాదు ప్రయణా తేదీ మార్చిన తరువాత  టికెట్ ధర పెరిగితే…   ఆ అదనపు డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

44
టికెట్ నిబంధనలు ఏమిటి?

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం రైలు బయలుదేరడానికి 48 గంటల నుంచి 12 గంటల ముందు… కన్ఫర్మ్ అయిన టికెట్‌ను రద్దు చేస్తే, ప్రయాణ ఛార్జీలో 25 శాతం కోత పడుతుంది. 

రైలు బయలుదేరడానికి 12 గంటల నుంచి 4 గంటల ముందు రద్దు చేస్తే ఈ కోత ఇంకా పెరుగుతుంది.  రిజర్వేషన్ చార్ట్ సిద్ధమయ్యాక మాత్రం టిక్కెట్ క్యాన్సిల్ చేయడం కుదరదు. 

Read more Photos on
click me!

Recommended Stories