అద్భుతం: ఇక్కడ అందమైన ఇంటిని కేవలం రూ .100కి కొనొచ్చు.. కానీ ఒక కండిషన్..?

First Published Oct 20, 2021, 5:20 PM IST

ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి ద్రవ్యోల్బణ (inflation)కాలంలో ఇల్లు కొనడం లేదా నిర్మించడం చాలా కష్టమైన పని. ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితకాల సంపాదన మొత్తం ఇల్లు కొనడం వైపే వెళ్తుంది. ఇవన్నీ పక్కన పెడితే  సొంత ఇల్లు(own house) కావాలన్నది ప్రతి ఒక్కరి కల. కానీ మీరు అతి తక్కువ, చౌకైన, అందమైన ఇంటిని కొనుగోలు చేయవచ్చు. అది ఎలానో, దాని గురించి తెలుస్తే మీరు అస్సలు నమ్మరు.
 

మీరు కేవలం రూ .100 లకే ఇల్లు సొంతం అవుతుందని తెలిస్తే నమ్ముతారా? మీరు దీన్ని ఖచ్చితంగా నమ్మరు, కానీ ఇది పూర్తిగా నిజం. అయితే అలాంటి చౌక ఇల్లు భారతదేశంలో లేదు. ఈ ఇల్లు అబ్రూజో(abruzzo) రాష్ట్రంలో ప్రతోలా పెలిగ్నా (pratola peligna)అనే ప్రదేశంలో ఉంది. ప్రటోలా పెలిగ్నా అపెన్నైన్ పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ ప్రజలు నివసించడానికి కేవలం 100 రూపాయలకే ఇల్లు పొందవచ్చు. ఇక్కడ ప్రభుత్వం ఒక పథకాన్ని కూడా ప్రారంభించింది, దీని కింద ప్రజలకు చౌక ఇళ్ళు అందిస్తుంది.

ప్రభుత్వం  ఈ పథకం కొద్ది రోజుల క్రితమే ప్రటోలా పెలిగ్నాలో ప్రారంభించింది. ఇళ్లు అవసరమైన వారి నుంచి దరఖాస్తులు కూడా కోరుతున్నారు. ఇక్కడ 250 ఇళ్లను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొనుగోలుదారులు దానిని మరమ్మతు చేయవలసి ఉంటుంది, దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది.

ఇల్లు కొనడానికి కూడా ఇదే షరతు, మీరు ఈ ఇంటిని వంద రూపాయలకు కొనుగోలు చేయవచ్చు, కానీ దాన్ని బాగు చేయడానికి మీ వద్ద డబ్బు ఉండాలి. ప్రతోల పెలిగ్నా అథారిటీ ప్రకారం, ఆరు నెలల్లో ఇల్లు మరమ్మతులు చేయకపోతే ఇంటి యజమాని సుమారు రూ .9 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 

స్కీ రిసార్ట్ అండ్ రోమ్
ఈ ఇల్లులు ఉన్న ప్రదేశానికి స్కీ రిసార్ట్ చాలా దగ్గరగా ఉంది. అంతేకాకుండా రోమ్(rome) కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఒక యూరో(euro)కి ఒక ఇంటిని విక్రయించే ప్రణాళికను ఇటాలియన్ అధికారులు తీసుకువచ్చారు. ఈ గృహాలు వేలం వేయబడతాయి అది కూడా ఒక యూరోతో ప్రారంభమవుతాయి. 

 ఇంటి యజమానులు మూడు సంవత్సరాలలో నివాసయోగ్యంగా ఉండాలి. ఎవరైనా ఇటలీ వెలుపల నివసిస్తుంటే లేదా అతను కొనుగోలు చేస్తుంటే అతను రూ .2 లక్షల 62 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఇక్కడ ప్రభుత్వం అనేక నగరాల్లో చౌక ఇళ్ల పథకాన్ని అమలు చేసింది.

click me!