బిర్యానీ లవర్స్ కి టేస్టీ న్యూస్.. చార్మినార్ వద్ద పారడైజ్ రెస్టారెంట్‌ ప్రారంభం..

First Published Oct 20, 2021, 3:09 PM IST

హైదరాబాద్: చార్మినార్  అలాగే  ప్రపంచానికి ఇష్టమైన బిర్యానీ ప్యారడైజ్(paradise) నేడు చార్మినార్‌లోని ఐకానిక్ సైట్‌లో డైన్-ఇన్, టేక్ అవే, డెలివరీని అందించే ఓమ్ని ఛానల్ రెస్టారెంట్ ప్యారడైజ్ హోటల్  ప్రారంభించింది. రెస్టారెంట్‌లో భోజనం చేస్తు అతిథులు ఇప్పుడు తమకు ఇష్టమైన బిర్యానీని ఆస్వాదిస్తు  వారు కూర్చున్న ప్రదేశం నుండి  చార్మినార్ (charminar) అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఆస్వాదించవచ్చు. 

పారడైజ్ ఐకానిక్ ఫుడ్ అండ్ కస్టమర్ సర్వీస్‌కు ఎంతో ప్రసిద్ధి. పర్యాటకులు,  నివాసితులకు ఈ అవుట్‌లెట్ ప్రారంభంతో  లేజెండారి బిర్యానీతో వెంటనే సంతృప్తిపర్చడానికి అనుకూలమైన ఆప్షన్ అందిస్తుంది. అలాగే హైదరాబాద్‌లో ప్యారడైజ్  20వ స్టోర్‌ని ప్రారంభిస్తు ఆహార ప్రియులను ఒకచోట చేర్చింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే  ప్రతి 3 సెకన్లకు ఒక ప్యారిడైజ్ రెస్టారెంట్‌లో ఒక బిర్యానీ వడ్డిస్తున్నారు, అలాగే చార్మినార్ వద్ద లెక్కలేని సందర్శకుల షాప్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన హైదరాబాద్ ఈ రెండింటి ప్రజాదరణను సూచిస్తుంది.

అత్యుత్తమ నాణ్యత, అత్యంత పరిశుభ్రతతో కస్టమర్‌కు అందించే ఉత్తమమైన బిర్యానీ, కబాబ్‌లు ఇంకా ఇతర ఆహారం ప్రస్తుత కాలంలో అవసరమైన భద్రతా చర్యలకు అనుగుణంగా ఆస్వాదించవచ్చు.

 పారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రై. లిమిటెడ్ ఛైర్మన్  అలీ హేమతి ఈ సందర్భంగా మాట్లాడుతూ , "నగరంలో 20వ పారడైజ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించాలనే మా నిర్ణయం, సుదూర ప్రాంతాల సందర్శకులకు శుభవార్తగా వస్తుంది. వారు ప్రపంచంలోని అత్యుత్తమమైన చార్మినార్ మా పాపులర్ బిర్యానీని ఒకేచోట పొందాలనుకుంటున్నారు. మీరు కూర్చున్న చోట నుండి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ చార్మినార్ చూడటం చాలా సంతోషాన్నిస్తుంది. ఇప్పుడు ప్యారిడైజ్ 
మీకోసం ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది. చరిత్ర ప్రియులు, ఆహార ప్రియుల హైదరాబాదీ హెరిటేజ్ ఒక సమ్మేళనం. ఇప్పుడు నగరంలోని ఒక మూలన నుండి చార్మినార్ చూడటానికి వచ్చి పారడైజ్ బిర్యానీని ఆస్వాదించడానికి మరొక దిశలో వెళ్లడానికి పాత విషయం. మా దశాబ్దాల ప్రయత్నం కస్టమర్ సేవ, నాణ్యతను కాపాడటానికి భద్రతా చర్యలు చాలా ఉన్నాయి, ఇది సందర్శకులు ప్రస్తుత కాలంలో భోజనం చేయడంపై ఆధారపడేలా చేస్తుంది. " అని అన్నారు.

డా. కాజిమ్ హేమతి, డైరెక్టర్ - పారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రై. లిమిటెడ్  మాట్లాడుతూ “ఐకానిక్ స్మారక చిహ్నం దగ్గర మా కొత్త లాంచ్ తో మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది ఒక రెండు చిహ్నాల సమావేశం" అని అన్నారు.

పారడైజ్ ఫుడ్ కోర్ట్ ప్రై. లిమిటెడ్  సి‌ఈ‌ఓ గౌతమ్ గుప్తా "భారతదేశంతో పాటు విదేశాల నుండి వచ్చే సందర్శకులు తప్పక సందర్శించాల్సిన గమ్యస్థానాలలో పారడైజ్ ఎల్లప్పుడూ ఉంటుంది. చార్మినార్‌లో స్మారక చిహ్నాన్ని చూడటానికి మా అవుట్‌లెట్ లో మా రుచికరమైన బిర్యానీ ఒకేసారి చూడాలనుకునే వారికి   రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ప్యారడైజ్ అత్యుత్తమ నాణ్యమైన ఆహారాన్ని తీసుకురావడానికి  లిగసి కొనసాగిస్తోంది.  

ఫుడ్ చైన్ పారడైజ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 'మోస్ట్ బిర్యానిస్ సర్వేడ్ ఇన్ ఏ ఇయర్' అనే చోటు దక్కించుకుంది. 2017 లో 70 లక్షల బిర్యానీలను, 2018లో 90 లక్షలకు పైగా బిర్యానిస్ అందించారు. 2018 లో ఇండియా ఫుడ్ ఫోరమ్‌లో ఆసియా ఫుడ్ కాంగ్రెస్ అండ్ గోల్డెన్ స్పూన్ అవార్డులో 'రెస్టారెంట్ సర్వీంగ్ ది బెస్ట్ బిర్యానీ' అవార్డును కూడా ప్యారడైజ్ గెలుచుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా  తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్స్, జి‌హెచ్‌ఎం‌సి, టైమ్స్ ఫుడ్ అవార్డు నుండి ఎన్నో ప్రశంసలు, పురస్కారాలను గెలుచుకుంది. వీటిలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా ఉన్నాయి.

పారడైజ్ గురించి:
1953లో సికింద్రాబాద్‌లోని  సినిమా థియేటర్ వద్ద పారడైజ్ అనే ఒక చిన్న క్యాంటీన్, కేఫ్ ఉండేది. థియేటర్ మూతపడినప్పుడు కూడా కేఫ్ సేవలను కొనసాగించింది. 1978 నుండి 1996 మధ్య  అలీ హేమతి నాయకత్వంలో రెస్టారెంట్ రీ-స్ట్రక్చరింగ్, పునర్నిర్మాణం, ఆధునికీకరణ జరిగింది. మారుతున్న సామాజిక ధోరణులకు అనుగుణంగా ఇంకా ప్రజల ఆహార అలవాట్లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది. ప్యారడైజ్ బ్రాండ్ హైదరాబాద్ బిర్యానీకి పర్యాయపదంగా మారింది.

  సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, సానియా మీర్జా, పివి సింధు, గౌతమ్ గంభీర్, ఎస్ఎస్ రాజమౌళి, రాజ్ కుమార్ హిరానీ, చెఫ్ సంజీవ్ కపూర్‌తో సహా ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులందరూ పారడైజ్ లో ఇష్టమైన బిర్యానీని ఆస్వాదించారు.

click me!