విచిత్రం: 70 ఏళ్లుగా ఇక్కడ ఎవరూ చనిపోలేదు, దీని వెనుక రహస్యం ఏమిటో తెలుసా..?

Ashok Kumar   | Asianet News
Published : Oct 20, 2021, 03:47 PM IST

భారతదేశం గురించి తెలిసిన  ప్రజలు నమ్మని ఎన్నో ప్రత్యేకమైన  ప్రదేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అలాంటి ప్రదేశంలో ఒకదాని గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. గత 70 ఏళ్లలో ఎవరూ చనిపోని ఈ విశిష్ట ప్రదేశం(unique place) గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. ఇది వినడానికి మీకు వింతగా అనిపించవచ్చు, కానీ ఇది పూర్తిగా నిజం. 

PREV
16
విచిత్రం: 70 ఏళ్లుగా ఇక్కడ ఎవరూ చనిపోలేదు, దీని వెనుక రహస్యం ఏమిటో తెలుసా..?

ఇప్పుడు అక్కడ ఎవరూ నివసించి ఉండరు మీరు అనుకుంటుండొచ్చు.. కానీ అలా కాదు. ఈ ప్రత్యేకమైన ప్రదేశంలో 70 సంవత్సరాలుగా ఎవరూ మరణించలేదు. ఈ ప్రత్యేక ప్రదేశం గురించి తెలుసుకుందాం...
 

26

ఈ ప్రత్యేక ప్రదేశం నార్వే (norway)లో ఉంది. ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి, ఈ కారణంగా దీనిని ప్రపంచంలోని ప్రసిద్ధ పర్యాటక (tourism)ప్రదేశాలలో చేర్చబడింది. నార్వేలోని ఈ ప్రదేశం పేరు లాంగ్ ఇయర్‌బెన్(long earben). ఈ ప్రదేశంలో ఎవరూ చనిపోలేరు. దీనికి కారణం తెలుసుకుంటే మీ మనస్సులో ఎందుకు అలా అని ప్రశ్న తలెత్తుతుంది..?

36

నార్వేను మిడ్ నైట్ సన్  అని కూడా అంటారు. మే నెల నుండి జూలై చివరి వరకు ఈ దేశంలో సూర్యుడు అస్తమించడు. ఇక్కడ 76 రోజుల పాటు పగలు ఉంటుంది రాత్రి ఉండదు. ఇక్కడ స్వాల్‌బార్డ్‌లో కూడా ఏప్రిల్ 10 నుండి ఆగస్టు 23 వరకు సూర్యుడు అస్తమించడు. లాంగ్ ఇయర్‌బెన్‌లోని అడ్మినిస్ట్రేషన్ ఒక చట్టం చేసింది, ఈ కారణంగా ప్రజలు ఇక్కడ చనిపోలేరు. అంటే మనుషుల మరణం ఇక్కడ నిషేధం.

46

అసలు ఆ  చట్టం ఏంటి 

నార్వే నార్త్ పోల్ లో ఉన్న లాంగ్ ఇయర్‌బెన్ లో  ఏడాది పొడవునా తీవ్రమైన చలి ఉంటుంది, దీని కారణంగా మృతదేహం ఇక్కడ కుళ్లిపోదు. ఈ కారణంగా, అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ మనుషుల మరణాన్ని నిషేధించింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నగరంలో 70 సంవత్సరాలుగా ఎవరూ మరణించలేదు. 

56

100 సంవత్సరాల క్రితం మరణం 
ఈ ప్రత్యేకమైన నగరంలో ఎక్కువ మంది క్రైస్తవ ప్రజలు నివసిస్తున్నారు. 1917 సంవత్సరంలో  ఇన్ఫ్లుఎంజా(influenza)వ్యాధితో తో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇక్కడ మరణించాడు. ఆ మనిషి శరీరం లాంగ్ ఇయర్‌బేన్‌లో ఖననం చేయబడింది, కానీ అతని శరీరంలో ఇప్పటికీ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉంది. ఈ కారణంగా నగరాన్ని ఏదైనా అంటువ్యాధి(viral diseases) నుండి కాపాడటానికి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ మరణాన్ని నిషేధించింది.
 

66

 ఈ నగర జనాభా సుమారు 2000. ఒక వ్యక్తి ఇక్కడ అనారోగ్యానికి గురైతే అతన్ని విమానం ద్వారా మరొక ప్రదేశానికి తీసుకువెళతారు. అప్పుడు మరణించిన తర్వాత అదే స్థలంలో ఆ వ్యక్తిని దహనం చేస్తారు.

click me!

Recommended Stories