పుదీనాను సాగు చేయడానికి భూమి తక్కువ ఉన్నా పర్లేదు. పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. పుదీనా కట్టలను తీసుకొని వాటిని కత్తిరించి విత్తనంగా నాటుకోవచ్చు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే దిగుబడి రావడం పుదీనా ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఒక్కసారి పుదీనా మొక్కలను నాటితే దిగుబడి పెరుగుతూనే ఉంటుంది. 5 నుంచి 6 ఏళ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది.
ఇక పుదీనా సాగుకు నీరు కూడా ఎక్కువగా అవసరం ఉండదు. డ్రిప్ ద్వారా తక్కువ మొత్తంలో నీటిని అందిస్తే సరిపోతుంది. మూడు రోజులకు ఒకసారి నీటిని అందించినా పర్లేదు. ఇక పెట్టుబడి విషయానికొస్తే భూమిని దున్నడానికి, పశువుల ఎరువులు, ఫర్టిలైజర్స్, పుదీనా కాడలు ఇలా అన్ని కలుపుకున్నా రూ. 20వేలు ఉంటే సరిపోతుంది. ఒకవేళ సొంత పొలం లేకపోయినా కౌలుకు తీసుకొని అయినా పుదీనా సాగు ప్రారంభించవచ్చు.