Budget: కోటి మంది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మీరూ ఉన్నారా?

Published : Feb 01, 2025, 07:02 PM ISTUpdated : Feb 01, 2025, 07:07 PM IST

ఉద్యోగులకు, మధ్య తరగతి వారికి భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు ఫైనాన్స్ మినిస్టర్  నిర్మలా సీతారామన్‌

PREV
14
Budget: కోటి మంది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మీరూ ఉన్నారా?

కేంద్ర బడ్జెట్ ని శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ బడ్జెట్ లో మధ్యతగరతి వారికి చాలా ఊరట కల్పిస్తూ.. పన్ను విధానంలో మార్పులు తీసుకువచ్చారు. ఉద్యోగులకు, మధ్య తరగతి వారికి భారీ ఊరట కల్పిస్తూ ఈ ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానాన్ని తీసుకువచ్చి, దాని ప్రకారం రూ.12లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్నే చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. 

 

24

ఈ కొత్త పన్ను విధానం వల్ల అదనంగా కోటి మందికి పైగా ప్రజలకు పన్ను (Income Tax) భారం నుంచి ఊరట లభించనుంది. ఈ విషయాలను  బడ్జెట్‌ (Union Budget) ప్రసంగం తర్వాత జరిగిన మీడియా సమవేశంలో ఆమె మాట్లాడారు. బడ్జెట్‌లో ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబుల సవరణలతో ప్రజల చేతుల్లో సరిపడా డబ్బులు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా రూ.8 లక్షల ఆదాయం ఉన్నవారు రూ.30వేలు పన్ను కట్టేవారు.

34

ఇకపై ఏమీ పన్ను కట్టాల్సిన పని లేదు. అలాగే మిగతా శ్లాబుల్లో ఉన్నవారికీ ఊరట లభించింది. రూ.12 లక్షల వరకు ఆదాయంపై రిబేట్‌ పెంపుతో కోటి మందికి పైగా ప్రజలు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

44

ఆర్థికవ్యవస్థలోని ప్రతీ అంశాన్నీ టచ్ చేసేశా బడ్జెట్‌ను రూపొందించాం. ఖర్చు చేసే ప్రతీ రూపాయి విషయంలో చాలా వివేకంతో వ్యవహరించాం. వ్యవసాయ రంగానికి అండగా ఉంటున్నాం. సీడ్స్ నుంచి మార్కెట్‌ వరకు అన్నిరకాల మార్పులూ చేయబోతున్నాం. రుణాలు, పెట్టుబడి సాయం , కొత్త వంగడాల సృష్టి ఇలా అనేక రకాలుగా రైతులకు సపోర్ట్ చేస్తున్నాం.  చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని మెరుగుపరిచాం అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories