Budget 2025: విద్య, వైద్య, నైపుణ్యాభివృద్ధికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025 లో అధిక ప్రాధాన్యం కల్పించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం చాకెట్ల లాంటి వరలు ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తన బడ్జెట్ ప్రసంగంలో రాబోయే ఐదేళ్లను అందరికీ అభివృద్ధి (సబ్ కా వికాస్) సాధించడానికి ఒక ప్రత్యేక అవకాశంగా ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. గత పదేళ్లుగా భారత్ అభివృద్ధి ట్రాక్ రికార్డు, నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయని తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2025పై లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "మన ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత పదేళ్లుగా మన అభివృద్ధి ట్రాక్ రికార్డు, నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ కాలంలోనే భారత శక్తి, సామర్థ్యంపై విశ్వాసం పెరిగింది. రాబోయే 5 సంవత్సరాలను సబ్ కా వికాస్ ను సాకారం చేయడానికి, అన్ని ప్రాంతాల సమతుల్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశంగా మేము చూస్తున్నామని" తెలిపారు.
nirmala ai
విద్యా సంస్థలో మౌలిక సదుపాయాల పెంపునకు పెద్దపీట
2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఐఐటీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద ప్రకటన చేశారు. విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామనీ, ఇంటర్నెట్ కనెక్టివీటిని అందిస్తామని తెలిపారు. ఈ బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించగా, ఇందులో ఉన్నత విద్యాశాఖకు రూ.50,057 కోట్లు, పాఠశాల విద్యాశాఖకు 78,572 కోట్లు కేటాయించారు.
అలాగే, పాఠ్య పుస్తకాలను అన్ని భారతీయ భాషల్లో డిజిటల్ రూపంలో తీసుకువస్తామనీ, దీని కోసం ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ‘భారతీయ భాషా పుస్తక్’ పథకం ప్రకటించారు. ఐఐటీ సామర్థ్యాన్ని పెంచుతామని ఆయన ప్రకటించారు. ఐదు ఐఐటీల్లో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని బడ్జెట్‌లో ప్రకటిస్తూ ఆర్థిక మంత్రి తెలిపారు. దీంతో పాటు ఐఐటీ పాట్నాను కూడా విస్తరించనున్నారు.
ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు
ప్రభుత్వ విద్య, ఆరోగ్య రంగంలో పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్ద ప్రకటన చేశారు. యువతలో ఉత్సుకత, ఆవిష్కరణలు, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇది కాకుండా, BharatNet ప్రాజెక్ట్ కింద, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించనున్నట్టు తెలిపారు. భారతీయ భాషల డిజిటల్ పుస్తకాలను పాఠశాలలు, ఉన్నత విద్యలో అందుబాటులో ఉంచే లక్ష్యంతో "ఇండియన్ లాంగ్వేజ్ బుక్ ప్రాజెక్ట్" అమలు చేయనున్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముదుకు సాగుతాం : నిర్మలమ్మ
మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ తయారీకి నైపుణ్యాలు, ఉన్నత స్థాయి విద్యలో పెట్టుబడి చాలా అవసరం అని నిర్మలా సీతారామన్ చెప్పారు. యువత నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి ప్రపంచ నైపుణ్యం, భాగస్వామ్యాలతో నైపుణ్యం కోసం 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశారు. అదనంగా, 2014 నుండి ప్రారంభించబడిన ఐదు ఐఐటిలలో 6500 అదనపు విద్యార్థులకు విద్యను అందించడానికి అదనపు మౌలిక సదుపాయాలు సృష్టించనున్నారు.
500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో 10,000 అదనపు సీట్లు జోడించనున్నారు. రాబోయే ఐదేళ్లలో అదనంగా 75,000 సీట్లను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.