సౌలభ్యం(Flexibility)
మహిళల ఆర్థిక అవసరాలు విభిన్నంగా ఉంటాయి. ఇంటిని కొనడానికి, చదువు కోసం, పదవీ విరమణ తర్వాత ఉపయోగపడాలని పొదుపు చేయాలనుకుంటారు. ఇలాంటి ఆలోచనలకు మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఆప్షన్ అవుతుంది. సేఫ్ గా పెట్టుబడి లక్ష్యాలు, రిస్క్‌లను తీర్చగల సామర్థ్యం ఉంటుంది. ఇది మహిళలకు వారి వ్యక్తిగత అవసరాలు, ఆకాంక్షలకు సరిపోయే ఫండ్స్‌ని అందిస్తుంది.
దీర్ఘకాల వృద్ధి సామర్థ్యం(Long-Term Growth Potential)
రికార్డ్స్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. మహిళలు క్రమం తప్పకుండా, వారి కెరీర్ ప్రారంభంలోనే పెట్టుబడి పెడితే కౌంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా సంపదను గణనీయంగా పెంచుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో సంపదను పెంచడమే లక్ష్యం అయితే ఈక్విటీ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక. లేదా మీ సేఫ్టీ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే డెట్ స్కీమ్స్ మీకు మంచి రిటర్స్ ఇస్తాయి. మీకు రిస్క్ తీసుకొనే ధైర్యం ఉంటే ఈక్విటీ, డెట్ మిశ్రమం అయిన హైబ్రిడ్ స్కీమ్స్‌ని కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు.