ట్రాయ్ ఏం చెబుతోందంటే.. బ్యాంకులు, ఈ-కామర్స్ సైట్‌లు, ఇతర ఆర్థిక సంస్థల నుండి వచ్చే లావాదేవీ, సర్వీస్ మెసేజ్ లను ఇంతకు ముందు వరకు ఎటువంటి నిబంధనలు లేకుండా పంపేది. అయితే ఇలాంటి ఓటీపీ మెసేజస్ లను ఉపయోగించుకొని ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా చేస్తున్నారు. వీటిని అరికట్టడం కోసం ఆ సందేశాలన్నీ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది.
టెలిమార్కెటర్లు, టెలికాం సంస్థలు ఈ నియమం అమలు చేయడానికి ఇంకా సిద్ధంగా లేవు. మెసేజ్ లు ఫిల్టర్ చేసి పంపించే క్రమంలో జరిగే ఆలస్యం వల్ల వినియోగదారుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని వ్యాపారులు అంటున్నారు. భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘం (COAI) ఈ సమస్యపై TRAIకి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. సెక్యురిటీ, సేఫ్టీ కోసమే ఈ నియమాన్ని తెచ్చినప్పటికీ వెంటనే తాము అమలు చేయలేమని, తేదీని పొడిగించాలని కోరింది. భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా వంటి టెలికాం కంపెనీలు ఉన్నాయి.