స్టాక్ మార్కెట్ భూతల స్వర్గం లాంటిది. పైకి కనిపించినంత అందంగా ట్రేడింగ్ చేస్తుంటే ఉండదు. భారీ లాభాలు చేతికందినట్టే అంది అంతలోనే తీవ్రమైన నష్టాలు కలుగుతాయి. ఇలా ఎందుకు జరుగుతోందో తెలిసే లోపే మరింత నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే స్టాక్ మార్కెట్ ద్వారా లాభ పడిన వారికంటే నష్టపోయిన వారే ఎక్కువ మంది ఉంటారని నిపుణులు చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్. ఇంట్రా డే ట్రేడింగ్ చేస్తూ చాలా మంది నష్టపోతుంటారు. ఇదే కాకుండా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(F&O) యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అయితే లాభాలు ఎలా సంపాదించాలో తెలియక భారీ మొత్తంలో నష్టపోతున్నారు.
అయితే తెలివితేటలు, ప్రపంచ విషయాలపై నాలెడ్జ్ ఉంటే స్టాక్ మార్కెట్ లో అద్భుతాలు చేయొచ్చు. కేవలం ట్రేడింగ్ చేసి కోటీశ్వరులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. వారెన్ బఫెట్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. చేసే వ్యాపారాలు తక్కువ.. వేరే బిజినెసుల్లో పెట్టుబడులు పెట్టేది ఎక్కువ. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ చేయడమే ఆయన సక్సెస్ కి ప్రధాన కారణం. ఆయనే కాకుండా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా షేర్ మార్కెట్ ద్వారా బిలియనీర్లుగా ఎదుగుతున్నారు.
సెబీ(SEBI) నివేదిక ప్రకారం స్టాక్ మార్కెట్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(F&O) ఇండియన్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న పట్టణాల్లో ఉండే యువత వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే వీరి ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షల లోపే ఉంటోంది. అయినప్పటికీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ చివరికి నష్టాలనే ఎదుర్కొంటున్నారు. వీరిలో ఎక్కువ శాతం యువత ఉంటున్నారని సెబీ నివేదిక వెల్లడిస్తోంది.
గత ఫైనాన్సియల్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ట్రేడింగ్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే వారిలో 92.1 శాతం మంది నష్టపోయారని సెబీ నివేదిక చెబుతోంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(F&O) పెట్టుబడి పెట్టిన వారిలో 25 శాతం మంది టైర్-1 సిటీస్ కు చెందిన వారు ఉన్నారు. వీరంతా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పెట్టుబడిలో 36.8 శాతం పెట్టుబడి పెట్టారు. అయితే 26.2 శాతం పెట్టుబడిని వారు నష్టపోయారు. దీన్ని బట్టి ఇండియన్స్ ఎంత ఎక్కువగా నష్టపోయారో అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(F&O) లో పెట్టుబడి పెట్టే వారిలో మహిళల సంఖ్య గత ఏడాడితో పోల్చితే తగ్గిందని సెబీ నివేదించింది.
2024 ఫైనాన్షియల్ ఇయర్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్(F&O)లో పెట్టుబడి పెట్టిన వారిలో సగానికి పైగా కొత్తగా ట్రేడింగ్ చేస్తున్న వారే ఉన్నారు. అంటే 92.1 శాతం మంది కొత్త వారే ఉన్నారు. నష్టాలు అంచనా వేసేందుకు ఓ లెక్క కోసం 10 మంది ఇండివిడ్యువల్ ట్రేడర్స్ లో 9 మంది నష్టాలు చవిచూశారని సెబీ నివేదిక చెబుతోంది. అంటే ఒక్కో ట్రేడర్ సుమారుగా రూ.1.2 లక్షలు నష్టపోయారు. అయితే గత ఏడాది ఈ నష్టం ఇంకా ఎక్కువగా ఉంది. గత ఏడాది రూ.1.43 లక్షలు ఒక్కో ఇండియన్ ట్రేడర్ నష్టపోయారు.
ట్రేడింగ్ లో ఎక్కువగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా నష్టపోతున్నారు. వీరిలో కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యువతే ఎక్కువ మంది నష్టపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలివి తేటలు, నాలెజ్డ్ పెంచుకోకుండా షేర్ మార్కెట్ లోకి దిగడం చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. భారీ పెట్టుబడులు కూడా పెట్టవద్దని, తక్కువ ఇన్వెస్ట్ చేసి అవగాహన పెంచుకొని తర్వాత ఎక్కువ పెట్టుబడులు పెట్టేలా ప్లాన్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.