రోజుకు రూ.5.6 కోట్ల విరాళం ఇస్తున్న కోటీశ్వరుడెవరో తెలుసా?

First Published | Aug 3, 2024, 1:35 PM IST

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసింది. అందులో 200 మంది భారతీయులు ఉన్నారు. మరి వారిలో రోజుకు రూ.5.6 కోట్ల విరాళం ఇస్తున్న కోటీశ్వరుడెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోర్బ్స్ జాబితాలో  ఇప్పటికే 200 మంది భారతీయులు ఉండగా ఇటీవల విడుదల చేసిన జాబితాలో కొత్తగా మరో 25 మంది చేరారు. వీరంతా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన వారు అయినప్పటికీ ప్రస్తుతం ప్రముఖ మహా నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉంటూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు శివ నాడార్.

HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడైన శివ నాడార్ అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఆయన నికర ఆదాయం విలువ $36 బిలియన్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.3,01,670 కోట్లు అన్నమాట.  ఇలా ఎంతో మంది బిలియనీర్లు రోజూ కోట్లు సంపాదిస్తున్న నాడార్ తన దాతృత్వ గుణంతో ప్రత్యేకత చాటుకుంటున్నారు.  ఆయన రోజూ రూ.5.6 కోట్లు విరాళంగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన దేశ రాజధాని డిల్లీలో నివస్తున్నారు. 
 

Latest Videos


శివనాడార్ 1945లో తమిళనాడు రాష్ట్రంలోని  తూత్తుకుడి జిల్లాలోని మూలైపోజి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శివసుబ్రహ్మణ్య నాడార్, వామసుందరీ దేవి. కుంభకోణం, మధురై, కోయంబత్తూరుల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1967లో పూణేలోని వాల్‌చంద్ గ్రూప్‌కు చెందిన కూపర్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌లో తన మొదటి ఉద్యోగం చేశారు. 1976లో తన స్నేహితులతో కలిసి రూ.1,87,000 పెట్టుబడితో నోయిడాలోని ఓ గ్యారేజీలో HCLను ప్రారంభించారు.

మొదట మైక్రోకాంప్ అనే కంపెనీని స్థాపించి దీని ద్వారా డిజిటల్ కాలిక్యులేటర్లను విక్రయించేవారు.  కొన్ని నెలల తర్వాత కంపెనీ పేరును హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (HCL టెక్నాలజీస్)గా మార్చారు. 
గత 40 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో HCL బ్రాంచ్ లను విస్తరింపజేశారు. ప్రస్తుతం ఆయన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన వారసురాలైన రోషిణి నాడార్ కు బాధ్యతలు అప్పగించారు. దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఆమె కూడా ఒకరు కావడం విశేషం. 

భారతదేశంలోని ప్రముఖ పరోపకారుల్లో శివ్ నాడార్ ఒకరు. హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2023 ప్రకారం, ఆయన 2022-2023 సంవత్సరంలో సుమారు రూ. 2,042 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంటే రోజుకు దాదాపు 5.6 కోట్ల రూపాయలన్న మాట. ఆయన వరుసగా మూడు సంవత్సరాలు  'India's Most Generous Person' గౌరవాన్ని అందుకున్నారు. చెన్నైలో SSN ఇంజనీరింగ్‌ కాలేజీతో పాటు దేశంలో అనేక విద్యా సంస్థలను HCL నడుపుతోంది.

click me!