JIO నుంచి BSNLలోకి మారే ముందు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి

First Published | Aug 3, 2024, 12:04 PM IST

ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ jio, Airtel, Vodafone-idea నెట్వర్క్‌లు పోటీపడి తమ టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. దీంతో అసహనం చెందిన వినియోగదారులు BSNL లోకి మారుతున్నారు. మీ ఊర్లో అసలు BSNL కి సిగ్నల్ ఉందో లేదో ఈ విధంగా check చేసుకొని తీసుకోవడం మంచిది.
 

 రిలయన్స్ jio, Airtel, Vodafone-idea నెట్వర్క్ లు భారీగా టారిఫ్ లను పెంచాయి. ఒక్కో ప్లాన్ మీద jio గరిష్టంగా 25 శాతం, Airtel 21 శాతం పెంచడంతో వాటి వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన BSNL తన టారిఫ్ ధరలను తగ్గిస్తూ ప్రకటన చేయడంతో చాలామంది తమ నెట్వర్క్ ను BSNL లోకి మార్చుకుంటున్నారు.
 

ఇప్పటికే 2,50,000 మంది ఇతర నెట్వర్క్ ల నుంచి బిఎస్ఎన్ఎల్ లోకి మారారు. కొత్తగా 25 లక్షల మంది బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే మన దేశంలో చాలా ప్రాంతాల్లో bsnl నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఆ వినియోగదారులు చాలా కాలంగా అవస్థలు పడుతున్నారు.  దీంతో సంస్థ కూడా ఇతర నెట్వర్క్ సంస్థలతో పోటీ పడలేక నష్టాల్లోకి పడిపోయింది.  ఇప్పుడు నెట్వర్క్ ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.
 


TATA కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 4G నెట్వర్క్ బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆ తర్వాత 5G సేవలు అందించేందుకు ప్రణాళికలు వేస్తోంది. అయితే పోటీ నెట్వర్క్ లు అయిన jio, Airtel,Vodafone-idea లు ఇప్పటికే 4 G సేవలు అందిస్తూ,   5G సౌకర్యాన్ని వినియోగదారులకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 
 

ఇతర నెట్వర్క్ ల నుంచి బీఎస్ఎన్ఎల్ లోకి మారే ముందు మీ ప్రాంతంలో సిగ్నల్స్ ఏ విధంగా ఉన్నాయో పరీక్షించుకోండి. దీనికోసం మీరు మీ మొబైల్ లో గూగుల్ లోకి వెళ్లి nperf.comను ఓపెన్ చేయండి. అందులో maps ను క్లిక్ చేసి coverage map లోకి వెళ్లండి. Carrier option లో bsnl mobile సెలెక్ట్ చేసి సెర్చ్ లో మీ ఊరు పేరు ఇచ్చి ఎంటర్ కొట్టండి. దీంతో మీ ఊరు చుట్టూ ఉన్న బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సిగ్నల్స్ కనిపిస్తాయి. గ్రీన్ కలర్ కనిపిస్తే 3G సిగ్నల్స్ ఉన్నట్టు.. పర్పుల్ కలర్ కనిపిస్తే 5జి సిగ్నల్స్ ఉన్నాయని అర్థం. అసలు ఏ కలర్ కనిపించకపోతే అక్కడ బిఎస్ఎన్ఎల్ కి సిగ్నల్ లేదని అర్థం. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుని మీ నంబరు మార్చుకోవడం, లేదా కొత్త కనెక్షన్ తీసుకోవడం మంచిది.

Latest Videos

click me!