Home Loan: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే హోమ్ లోన్ భారం లేకుండా, తక్కువ సమయంలోనే లోన్ ఎలా క్లోజ్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ ఉపయోగించి లక్షల రూపాయల వడ్డీని ఎలా ఆదా చేయవచ్చు.
సొంత ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి కల. చాలామంది 15 నుంచి 20 ఏళ్ల పాటు ఈఎంఐలు కడుతూనే ఉంటారు. అయితే, సరైన ఆర్థిక ప్రణాళిక ఉంటే హోమ్ లోన్‌ను త్వరగా క్లియర్ చేయడమే కాకుండా, అదనపు లాభాలను కూడా పొందవచ్చని బిజినెస్ నిపుణులు అంటున్నారు.
25
హోమ్ లోన్ తీసుకునే ముందు జాగ్రత్తలు
లోన్ తీసుకునే ముందు మీ ఉద్యోగ భద్రత గురించి ఆలోచించడం ముఖ్యం. ప్రస్తుత కాలంలో ఏ క్షణంలోనైనా ఉద్యోగం పోవచ్చు, కాబట్టి లోన్ కట్టడానికి ముందే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లేదా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు, 70 లక్షల ఇల్లు కొనాలనుకుంటే, ముందుగానే కోటి రూపాయల వర్త్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ క్రియేట్ చేసుకుంటే, భవిష్యత్తులో ఉద్యోగం పోయినా ఇబ్బంది ఉండదు.
35
తక్కువ కాలం కంటే ఎక్కువ కాలం (Tenure) ఎందుకు మేలు?
చాలా మంది వడ్డీ తక్కువ పడుతుందని 15 ఏళ్లకే లోన్ తీసుకుంటారు. కానీ, ఎక్కువ కాలం (20-25 ఏళ్లు) లోన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే.. హోమ్ లోన్ వడ్డీ రేటు సుమారు 8.5 శాతం నుంచి 9 శాతం వరకు ఉంటుంది. ఇది అన్ని లోన్ల కంటే తక్కువ. మీరు తక్కువ కాలం(15 ఏళ్లు) లోన్ తీసుకుంటే కట్టే ఈఎంఐకి, ఎక్కువ కాలం(20 ఏళ్లు) తీసుకుంటే కట్టే ఈఎంఐకి మధ్య ఉన్న తేడాను మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
ఉదాహరణకు, 50 లక్షల లోన్‌పై 15 ఏళ్ల ఈఎంఐ(49,000), 20 ఏళ్ల ఈఎంఐ(43,000) మధ్య రూ. 5,800 వ్యత్యాసం ఉంటుంది. ఈ 5,800 రూపాయలను 12 శాతం రిటర్న్స్ ఇచ్చే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో పెడితే, 15 ఏళ్ల తర్వాత మీకు సుమారు 32 లక్షల రూపాయలు వస్తాయి. అప్పుడు ఆ డబ్బుతో మిగిలిన లోన్ క్లోజ్ చేసినా మీకు ఇంకా రూ. 11 లక్షలు మిగులుతాయి.
55
మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్
లోన్ డబ్బులు ఎక్స్ ట్రా వస్తే ముందే క్లోజ్ చేయడం కంటే, ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసేటప్పుడు ఎమోషనల్‌గా ఇల్లు కొనడానికి ఆ ఫండ్స్‌ని వాడకూడదని బిజినెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.