Whats App
వాట్సాప్ లేని ఫోన్ లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ మనిషి జీవితంలో వాట్సాప్ ఒక భాగమైపోయింది. ఉదయం లేవగానే మొదట, రాత్రి పడుకునే ముందు చివరిగా వాట్సాప్ చూడాల్సిందే. ఇందులోని అద్భుతమైన ఫీచర్లే ఈ యాప్‌కు క్రేజ్ తగ్గకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. యూజర్ల ప్రైవసీకి కూడా పెద్ద పీట వేస్తూ కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ తాజా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడినట్లు తెలుస్తోంది.
సాధారణంగా మనం ఎవరికైనా ఫొటోలు లేదా వీడియోలు పంపితే వాటిని నేరుగా మన ఫోన్‌లో సేవ్ చేసుకోవచ్చనే విషయం తెలిసిందే. అయితే ఇకపై ఫొటో లేదా వీడియో మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా పంపిన వారి పర్మిషన్ ఉండాల్సిందే. పంపిన వ్యక్తి అనుమతి ఇస్తేనే మీరు సదరు ఫొటో లేదా వీడియోను మీ ఫోన్‌లో సేవ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ఐఓఎస్ యూజర్లకు ఆ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకున్నారు. కేవలం సేవ్ మాత్రమే కాకుండా ఫొటోలను ఫార్వర్డ్ కూడా చేయలేరు. మీకు వచ్చిన ఫొటోలను ఇతరులకు ఫార్వర్డ్ చేయాలన్నా పంపిన వారి అనుమతి తప్పకుండా ఉండాల్సిందే. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వాట్సాప్‌లో వచ్చిన కొత్త మార్పులను గమనించారా.?
* వాట్సాప్ సైలెంట్‌గా కొన్ని కొత్త అప్డేట్స్‌ను తీసుకొచ్చింది. ఇంతకు ముందు మనం ఎవరితో అయినా చాటింగ్ చేసే సమయంలో అవతలి వ్యక్తి మెసేజ్ టైప్ చేస్తుంటే.. 'టైపింగ్' అని వచ్చేది. కానీ ప్రస్తుతం 'త్రీ డాట్స్' కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి.
* వాట్సాప్‌లో వచ్చిన మరో అప్‌డేట్ వాట్సాప్ గ్రూపులను ఓపెన్ చేసినప్పుడు గ్రూపు మెంబర్స్ పేర్లు కనిపించే చోట.. గ్రూపులోని ఎంత మంది ఆన్‌లైన్‌లో ఉన్నారో కూడా కనిపిస్తోంది.