ముంబైలోని MIDS, UKలోని మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ యూనిట్ తో కలిసి పనిచేస్తుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు.
మహీంద్రా ఇండియా డిజైన్ స్టూడియో ఎందుకోసం పనిచేస్తుంది?
వాణిజ్య, ప్రైవేట్ ఆటో విభాగాలు రెండింటికీ సేవ చేయడానికి కొత్త డిజైన్ స్టూడియో పనిచేస్తుంది. మహీంద్రా వెహికల్స్ కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వ్యాపార విస్తరణలో భాగంగా కొత్త డిజైన్ స్టూడియోను ఆవిష్కరించారు.
MIDS వాణిజ్య వాహనాలు, చిన్న ట్రాక్టర్లు, ట్రక్కులు, బస్సుల డిజైనింగ్ కూడా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో ట్రక్ క్యాబిన్‌లను నిర్వహించడానికి తగినంత పెద్ద డిజైనింగ్ విభాగం ఉంది.