100% సబ్సిడీతో 50,000 రుణాన్ని ఇంటికి ఒకరికి మాత్రమే ఇస్తారు. వితంతువులైన మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. 50,000 రుణం పొందిన వారికి 100% సబ్సిడీ లభిస్తుంది. లక్ష రూపాయలు రుణం పొందిన వారికి 90% రాయితీ లభిస్తుంది. అంటే కేవలం రూ.10 వేలు మాత్రమే తిరిగి కట్టాలి. ఈ రూ.10 వేలు కూడా బ్యాంకు లోన్ ఇస్తుంది. రెండు లక్షల లోపు రుణం పొందిన వారికి 80 శాతం రాయితీ లభిస్తుంది. నాలుగు లక్షల లోపు లోన్ తీసుకున్న వారికి 70% డిస్కౌంట్ లభిస్తుంది.