SIP Investment : నెలకు ₹10 వేల పెట్టుబడితో ₹4.7 కోట్ల రిటర్న్స్.. కోటీశ్వరులు కావాలంటే ఇది చూడాల్సిందే!

Published : May 09, 2026, 08:40 AM IST

SIP Investment : టాటా లార్జ్ క్యాప్ ఫండ్ అద్భుతం చేసింది. నెలకు ₹10,000 పెట్టుబడితో ఏకంగా ₹4.73 కోట్ల లాభాన్ని అందించింది. కాంపౌండింగ్ పవర్ అంటే ఇదే ! ఇది ఎలా సాధ్యం అయిందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
నెలకు ₹10,000 సిప్ తో ₹4.73 కోట్ల లాభం.. ఎలా సాధ్యం అయింది?

మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కోటీశ్వరులు అవ్వడం కష్టమేమీ కాదని టాటా లార్జ్ క్యాప్ ఫండ్ నిరూపించింది. గత 28 ఏళ్లలో ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించింది. కేవలం ₹10,000 నెలవారీ పెట్టుబడితో భారీ సంపదను ఎలా సృష్టించవచ్చో ఈ ఫండ్ డేటా స్పష్టం చేస్తోంది.

25
28 ఏళ్ల ప్రస్థానం.. అద్భుతమైన రిటర్న్స్

టాటా లార్జ్ క్యాప్ ఫండ్ కార్యకలాపాలు ప్రారంభించి 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫండ్ హౌస్ కీలక గణాంకాలను విడుదల చేసింది. మే 1998లో ఈ ఫండ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు (మార్చి 31 డేటా ప్రకారం) ఎవరైనా నెలకు ₹10,000 చొప్పున ఎస్ఐపి (SIP) చేసి ఉంటే, వారి పెట్టుబడి విలువ ఇప్పుడు ఏకంగా ₹4.73 కోట్లకు చేరుకుంది. సుదీర్ఘ కాలం పాటు మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకొని నిలబడితే కాంపౌండింగ్ పవర్ ఎలా ఉంటుందో ఈ రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది.

35
పెట్టుబడి ఎంత? లాభం ఎంత?

ఈ 28 ఏళ్ల కాలంలో ఒక ఇన్వెస్టర్ నెలకు ₹10,000 చొప్పున మొత్తం ₹33.4 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ మొత్తానికి వార్షిక ప్రాతిపదికన 15.72% రిటర్న్స్ (XIRR) లభించాయి. దీనివల్ల ఆ ఇన్వెస్టర్ కార్పస్ ₹4,72,90,000 (సుమారు ₹4.73 కోట్లు) గా మారింది. ప్రతి నెలా ఒకటో తేదీన ఇన్వెస్ట్ చేసినట్లు పరిగణించి ఈ లెక్కలను ఫండ్ హౌస్ వెల్లడించింది. మార్కెట్ సైకిల్స్ మారినా, ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు వచ్చినా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు మాత్రం భారీ లాభాలనే అందుకున్నారు.

45
షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి?

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తేనే కాకుండా, తక్కువ కాలపరిమితిలో కూడా ఈ ఫండ్ మంచి ఫలితాలు అందించింది. అయితే టైమ్ తగ్గేకొద్దీ రిటర్న్స్ కూడా మారుతూ వచ్చాయి.

• 10 ఏళ్ల కాలం: నెలకు ₹10,000 పెట్టుబడి పెట్టిన వారికి అది ₹20.58 లక్షలుగా మారింది.

• 20 ఏళ్ల కాలం: ఇదే పెట్టుబడి సుమారు ₹82.93 లక్షల వరకు పెరిగింది.

ప్రస్తుతం ఈ ఫండ్‌ను అభినవ్ శర్మ, హస్ముఖ్ విషారియా మేనేజ్ చేస్తున్నారు. ఈ ఫండ్ ప్రధానంగా నిఫ్టీ 100 టిఆర్ఐ (Nifty 100 TRI) బెంచ్‌మార్క్‌ను అనుసరిస్తుంది. టాప్ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెడుతుంది.

55
మార్కెట్ రిస్క్ కూడా ఉంటుంది.. నిపుణుల హెచ్చరిక

గతంలో వచ్చిన రిటర్న్స్ భవిష్యత్తులోనూ వస్తాయని చెప్పలేమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందు ఫండ్ డాక్యుమెంట్లను పూర్తిగా చదవాలి. అలాగే సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం.

గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి సలహాగా పరిగణించవద్దు. ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణులను సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories