Torn Notes: ఏటీఎం నుంచి అప్పుడప్పుడు కొందరికి చిరిగిన నోట్లు వస్తాయి. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. చిరిగిన నోట్ల విషయంలో ఆర్బీఐ కొన్ని రూల్స్ పెట్టింది. దీని వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం రాదు.
ఏటీఎం నుంచి డబ్బులు తీసేటప్పుడు కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తూ ఉంటాయి. అలాగే బాగా నలిగిన నోట్లు కూడా వస్తాయి. కొన్నిసార్లు నోట్లపై పిచ్చి పిచ్చి రాతలు ఉన్నవి కూడా వస్తూ ఉంటాయి. అవి మార్కెట్లో చెల్లవు. అప్పుడు ఏం చేయాలో తెలియక చాలా మంది ఆందోళన పడతారు. కానీ ఇది ప్రజల సమస్య కాదు.. ఆ బాధ్యత అంతా బ్యాంకుదే. అయితే దీనిపై ఆర్బీఐ కొన్ని నియమాలు ఉన్నాయి.
25
ఆర్బీఐ రూల్స్ ఏమిటి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన నిబంధనల ప్రకారం మీకు ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే కంగారు పడకండి. వాటిని బ్యాంకుకు తీసుకువెళ్లండి. బ్యాంకు ఆ నోట్లను తీసుకుని కొత్త నోట్లు మార్చి ఇస్తుంది. మీరు ఒక్క రూపాయి కూడా నష్టపోరు. ఆ నోటు అసలైనది అయితే చాలు, బ్యాంకు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా కొత్త నోటు ఇవ్వాల్సిందే.
35
చిరిగిన నోటు వస్తే...
ఏటీఎం నుంచి చిరిగిన నోటు రాగానే ఆందోళన పడిపోకండి. ముందుగా ఆ నోటును జాగ్రత్తగా భద్రపరచండి. ఆ నోటు ఏ ఏటీఎం నుంచి తీశారో… ఆ బ్యాంకు శాఖకు వెళ్లండి. 'ఈ నోటు ఏటీఎం నుంచి వచ్చింది అని ఆ బ్యాంకు అధికారులకు చెప్పండి. మీ దగ్గర ఏటీఎం రసీదును భద్రపరిచి వారికి ఇవ్వండి. లేదంటే బ్యాంకు వారికి అకౌంట్ స్టేట్‌మెంట్ చెక్ చేయమని అడగండి. దానికి ఆ నోటు వారి ఏటీఎం నుంచే వచ్చిందని వారు నిర్ధారించుకుంటారు. ఆ తరువాత నోటును మార్చి కొత్తది ఇస్తారు.
ఏటీఎం నుంచి వచ్చిన నోటు రెండు ముక్కలుగా చిరిగినా కూడా బ్యాంకు ఆ నోటును మార్చాల్సిందే. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ నోటుపై నంబర్ స్పష్టంగా ఉంటే చాలు దాన్ని మార్చడం చాలా సులభం. నోటుకు టేప్ వేసి ఇచ్చినా చాలు, కానీ నకిలీ నోట్లను మాత్రం మార్చరు.
55
సర్వీస్ ఛార్జ్
ఏటీఎంలో వచ్చిన చిరిగిన నోటును మార్చడం పూర్తిగా ఉచితం. దీనికి మీరు ఎలాంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంకు కూడా ఛార్జీలు వసూలు చేయకూడదు. ఎవరైనా అడిగితే వెంటనే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయవచ్చు.