Paytm: బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డంలో ఇబ్బందా.? అన్ని బ్యాంకుల వివ‌రాలు ఒకే చోట, పేటీఎమ్‌లో సూప‌ర్ ఫీచ‌ర్

Published : Jun 26, 2025, 11:11 AM IST

ఒక్కొక్క‌రి రెండుకు మించి అకౌంట్లు ఉంటున్నాయి. దీంతో సేవింగ్ ఖాతాల్లో ఎంత సొమ్ముందో తెలుసుకోవ‌డానికి ఒక్కో అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకొని, వాటి మొత్తాన్ని కూడాల్సి వ‌స్తుంది. అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టేందుకు పేటీఎమ్‌లో కొత్త ఫీచ‌ర్ వ‌చ్చింది. 

PREV
16
బ్యాలెన్స్‌ చెక్‌ ఒక్కచోటే

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం (Paytm) వినియోగదారుల కోసం మరో సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. యూపీఐతో లింక్ అయిన వివిధ బ్యాంకు ఖాతాల్లోని బ్యాలెన్స్ మొత్తాన్ని ఒకే చోట చూపించే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వేర్వేరు యాప్‌ల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని ఖాతాల్లో ఉన్న డబ్బును సమగ్రంగా తెలుసుకోవచ్చు.

26
ఒకేచోట అన్ని ఖాతాల సమాచారం

ఇప్పటివరకు ఏ ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలంటే ఆ బ్యాంకు యాప్‌కి వెళ్లాల్సి వచ్చేది. లేదా ఒక్కో అకౌంట్‌ను ఓపెన్ చేసి పిన్ ఎంట‌ర్ చేసి బ్యాలెన్స్ తెలుసుకోవాలి. అలాగే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉన్నవారు బ్యాలెన్స్ కలిపి చూడాలంటే మాన్యువల్‌గా లెక్కించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు పేటీఎం యాప్ ఒకే వేదికగా అన్ని యూపీఐ లింక్‌ అయిన ఖాతాల బ్యాలెన్స్‌ను చూపిస్తోంది.

36
యూపీఐ పిన్‌ ద్వారా సమాచారం

ఈ ఫీచ‌ర్‌ను ఉపయోగించేందుకు ప్రతి ఖాతా కోసం యూపీఐ పిన్‌ను ఒక్కసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత పేటీఎం యాప్‌లో “బ్యాలెన్స్ అండ్ హిస్టరీ” సెక్షన్‌లో వెళ్లినప్పుడు సంబంధిత ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని క్లియర్‌గా చూపిస్తుంది. ఖాతాల వారీగా డబ్బు వివరాలు అందిస్తుంది. అలాగే పైన మీ సేవింగ్ ఖాతాల్లోని మొత్తం అమౌంట్ క‌నిపిస్తుంది.

46
ఎవ‌రికి ఉప‌యోగం.?

ఈ ఫీచర్‌ ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే పర్సనల్ ఖర్చులు వేరు, సేవింగ్స్ వేరు అనే విధంగా ఖాతాలను వేరు వేరు ఉంచుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారి మొత్తం ఆర్థిక స్థితిగతులు ఒకే చోట తెలిసిపోతాయి. బ్యాలెన్స్ వివరాలు మాత్రమే కాకుండా, ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా అదే సెక్షన్‌లో చూడొచ్చు.

56
మ్యానువల్ లెక్కలు అవసరం లేదు

ఇప్పటి వరకు మనం చేతితో లెక్కలు వేసుకుని, ఒక్కో బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి చూడాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ఫీచర్‌తో ఆ పని అవసరం ఉండదు. Paytm యాప్ ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలు — అన్ని బ్యాంకుల సమాచారం వినియోగదారుని వేళ్లకు అందుతుంది.

66
ఎలా చెక్ చేసుకోవాలంటే.?

* ముందుగా మీ ఫోన్‌లో పేటీఎమ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

* ఆ త‌ర్వాత మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ సెక్ష‌న్‌లో ఉండే బ్యాలెన్స్ అండ్ హిస్ట‌రీ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.

* వెంట‌నే యూపీఐకి లింక్ అయిన మీ ఖాతాల వివ‌రాలు క‌నిపిస్తాయి.

* ఆయా ఖాతాల కింద క‌నిపించే చెక్ బ్యాలెన్స్ క్లిక్ చేసి పిన్ ఎంట‌ర్ చేయాలి.

* వెంట‌నే ఆ బ్యాంక్ ఖాతాలో ఉన్న అమౌంట్‌ను చూపించ‌డంతో పాటు.. పై టోట‌ల్ బ్యాలెన్స్‌లోనూ మీ ఖాతాలో మొత్తం డిస్‌ప్లే అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories