కార్మికులు, తక్కువ వేతనంతో ఇబ్బందులు పడుతోన్న వారికి కేంద్ర ప్రభుత్వం మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త పెన్షన్ పథకం ద్వారా నెలకు రూ. 3వేల పెన్షన్ పొందొచ్చు. ఇంతకీ ఏంటీ పథకం.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
ఆర్థికంగా వెనకబడిన వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరిన వారికి పదవి విరమణ తర్వాత నెలకు రూ. 3 వేల పెన్షన్ పొందే అవకాశాన్ని ఇచ్చింది. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
26
కేంద్ర ప్రభుత్వ పథకం
ప్రధాన మంత్రి శ్రామ్ యోగి మాన్-ధన్ యోజన (PM-SYM) నెలకు రూ. 3000 పింఛను అందించే ప్రభుత్వ పథకం. 2019లో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో చేరిన ప్రతీ ఒక్కరికీ నెలవారీ పెన్షన్ అందిస్తారు. అయితే ఇందుకోసం కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
36
ప్రధాన మంత్రి శ్రామ్ యోగి మాన్-ధన్ యోజనలో చేరే వారు నెలకు రూ. 55 చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు రూ. 3000 పెన్షన్ ను అందిస్తారు. కార్మికులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్వాతంత్రం పొందడానికి సహాయపడుతుంది. దంపతులిద్దరూ విడివిడిగా చేరి సంవత్సరానికి రూ. 72,000 పింఛను పొందవచ్చు.
46
ప్రధాన మంత్రి శ్రామ్ యోగి మాన్-ధన్ యోజన
ఈ పథకంలో చేరే వారి వయసు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. అలాగే నెలవారీ ఆదాయం రూ. 15,000 లోపు ఉండాలి. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ సభ్యులుగా ఉంటే ఈ పథకంలో చేరడానికి అనర్హులు. అలాగే ఈ పథకంలో చేరాలంటే ఈ శ్రమ్ కార్డు (కార్మిక కార్డు) కచ్చితంగా ఉండాలి.
56
దరఖాస్తు విధానం
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అనంతరం క్లిక్ హియర్ టు అప్లై నౌ అనే ట్యాబ్ ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘Self Enrollment’ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
66
ఆ తర్వాత మీ పేరు, ఈమెయిల్ ఐడీ, క్యాప్చా కోడ్ వంటి వివరాలను నమోదు చేసి Generate OTP క్లిక్ చేయండి. OTP నమోదు చేసి Verify క్లిక్ చేయండి. అవసరమైన వివరాలను నమోదు చేసి, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి దరఖాస్తును పూర్తి చేయండి. చివరగా భవిష్యత్తు అవసరాల కోసం డాక్యుమెంట్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి.