Creditcard: క్రెడిట్ కార్డుల‌ను వాడ‌కుండా ప‌క్క‌న ప‌డేస్తున్నారా.? ఏమ‌వుతుందో తెలుసా.?

Published : Jul 06, 2025, 02:04 PM IST

ప్ర‌స్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రి చేతిలో క్రెడిట్ ఉంటోంది. అయితే క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించే విష‌యంలో కొన్ని విష‌యాలు గుర్తుపెట్టుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
పెరుగుతోన్న క్రెడిట్ కార్డు వినియోగం

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డులు వినియోగం తీవ్రమైన స్థాయికి చేరుకుంది. రోజువారీ అవసరాల నుంచి విలాసవంతమైన ఖర్చుల వరకు వాటి వినియోగం విస్తరిస్తోంది. రెస్టారెంట్ బిల్లు, ట్రావెల్ టికెట్లు, సినిమాలు, షాపింగ్ వంటి వాటిలో డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు లభించడం వల్ల ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు. ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర రెండుకు మించి క్రెడిట్ కార్డులు ఉండ‌డం ఇటీవ‌లి కాలంలో సాధార‌ణంగా మారింది.

అయితే పేరుకు మూడు, నాలుగు కార్డులున్నా అవసరమైతేనే ఉపయోగించాలనే ఉద్దేశంతో కొందరు కొన్ని కార్డులను వాడకుండా అలాగే ఉంచుతారు. ఇంత‌కీ క్రెడిట్ కార్డును వాడ‌కుండా ప‌క్క‌న పెడితే ఏమ‌వుతుంది.? దీనివ‌ల్ల ఏమైనా న‌ష్టాలు జ‌రుగుతాయా.? ఇప్పుడు చూద్దాం.

25
క్రెడిట్ వాడ‌క‌పోతే ఏమ‌వుతుంది.?

బ్యాంకులు సాధారణంగా క్రెడిట్ కార్డును వాడకపోతే, ఆ కార్డును 12 నెలల పాటు ఆఫీషియల్‌గా యాక్టివ్‌గా ఉంచుతాయి. అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయకపోయినా, మీకు సమాచారం ఇచ్చిన తర్వాతే బ్యాంకు ఆ కార్డును క్లోజ్ చేస్తుంది. అలా గడువు ముగిసిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, 30 రోజుల ముందు నోటీసు ఇచ్చి కార్డును రద్దు చేస్తారు.

అయితే, మీకు ఆ క్రెడిట్ కార్డును వాడే ఆలోచన లేక‌పోతే, వెంటనే బ్యాంకును సంప్రదించి ఆ కార్డును అధికారికంగా క్లోజ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే వాడకపోయిన కార్డుపై కూడా మెయింటెనెన్స్ ఫీజులు, ఎప్పటికప్పుడు లేటీ ఫీజులు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ మీకు తెలియకుండానే డ్యుయ్‌గా మారిపోయి, తర్వాత మీ క్రెడిట్ స్కోర్‌పై చెడు ప్రభావం చూపవచ్చు.

35
క్రెడిట్ కార్డ్ యాక్టివ్‌గా ఉంచాలంటే ఏం చేయాలి?

మీ క్రెడిట్ కార్డును బ్యాంక్ యాక్టివ్‌గా చూపాలంటే, సంవత్సరానికి కనీసం ఒక్కసారి అయినా దానిని ఉపయోగించాలి. ఇది చిన్న మొత్తంలో అయినా ఉండొచ్చు. ఉదాహరణకు రూ. 100 విలువైన మొబైల్ రీచార్జ్ అయినా సరిపోతుంది. ఇలా మీరు కార్డును ఉపయోగించడం ద్వారా బ్యాంక్ దాన్ని యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.

కానీ కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయి. ఉదాహరణకు, మీ కార్డ్‌పై వేసే ఇంట్రెస్ట్ ఛార్జెస్ లేదా లేట్ ఫీజులను చెల్లించడం మాత్రం లావాదేవీగా ప‌రిగ‌ణించరు. అదే విధంగా ఆటో డెబిట్ అయినా, EMI పేమెంట్ లాంటివి అస‌లైన ట్రాన్సాక్ష‌న్స్ కిందికి రాక‌పోవ‌చ్చు. అందుకే సంవత్సరానికి ఒక్కసారి అయినా మ్యానువ‌ల్‌గా చిన్న పేమెంట్ అయినా చేయొచ్చు.

45
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ఉంటుందా?

క్రెడిట్ కార్డును వాడకపోయినా అది యాక్టివ్‌గా ఉన్నంత కాలం వరకు అది నేరుగా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపదు. కానీ దాచిన కార్డును బ్యాంకు క్లోజ్ చేసిన‌ప్పుడు మాత్రం, మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (Credit Utilization Ratio - CUR) మారిపోవచ్చు. ఇది సిబిల్ స్కోర్‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే మీ క్రెడిట్ కార్డు లిమిట్‌లో క‌నీసం 30 శాతం అయినా ఏటా ఒక‌సారి ఉప‌యోగించ‌డం వ‌ల్ల కార్డ్ యాక్టివ్‌గా ఉంటుంది.

55
క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి.?

ఇయ‌ర్లీ ఛార్జీలు ఎక్కువ‌గా ఉన్న కార్డుల‌తో అవ‌స‌రం లేక‌పోతే ముందు అలాంటి వాటిని మూసివేయం మంచిది. కానీ క్లోజ్ చేయేముందు కొన్ని కీలక విషయాలు గుర్తుంచుకోవాలి.

క్లియర్ బిల్స్: ఎలాంటి పెండింగ్ బిల్లు లేదా ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి.

అధికారికంగా క్లోజ్ చేయించాలి: కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి లేదా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి రాతపూర్వకంగా క్లోజ్ చేయించాలి.

కన్ఫర్మేషన్ తీసుకోవాలి: క్లోజ్ అయినట్టు మీ మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా ధృవీకరణ పొందాలి.

సివిల్ రిపోర్ట్ తనిఖీ చేయండి: 30-45 రోజులలోపు అది నిజంగా క్లోజ్ అయిందో లేదో సివిల్ స్కోర్ రిపోర్టులో చెక్ చేయండి.

ఒకవేళ మీరు క్రెడిట్ కార్డును సరిగ్గా వాడుతూ, బిల్లులు సమయానికి చెల్లిస్తుంటే, దాన్ని కొనసాగించడం వలన మీ క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. అలాగే మంచి క్రెడిట్ హిస్టరీ ఉండటం వలన ఫ్యూచర్‌లో లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు సమస్యలు రావు.

Read more Photos on
click me!

Recommended Stories