Home Loan EMI: ఈఎంఐలు ఎన్ని నెలలు కట్టకపోతే బ్యాంకు సీరియస్ అవుతుందో తెలుసా?

Published : Feb 19, 2025, 12:07 PM IST

Home Loan EMI: మీరు హోమ్ లోన్ తీసుకున్నారా? ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారా? మరి ఎన్ని నెలలు ఈఎంఐలు కట్టకపోతే బ్యాంకు మీపై చర్యలు తీసుకుంటుందో తెలుసా? ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

PREV
15
Home Loan EMI: ఈఎంఐలు ఎన్ని నెలలు కట్టకపోతే బ్యాంకు సీరియస్ అవుతుందో తెలుసా?

ప్రతి ఒక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా.. చాలామంది ఇల్లు కొనుక్కోవాలన్న లక్ష్యంతో ప్లానింగ్ వేసుకొని పని చేస్తుంటారు. ఈ క్రమంలో కొంత డబ్బు సమకూర్చుకొని మరికొంత లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం చేస్తారు. ఈ క్రమంలో బ్యాంకుల నుంచి తెచ్చిన లోన్లకు ఈఎంఐలు కడుతూ ఉండాలి.

అయితే ఇంతలో ఏవైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే ఈఎంఐలు కట్టలేక అవస్థలు పడుతుంటారు. ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐలు ఎన్ని నెలలు కంటిన్యూగా కట్టకపోతే  బ్యాంకులు మీపై చర్యలు తీసుకుంటాయో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 
 

25

సాధారణంగా హోమ్ లోన్ తీసుకుంటే టెన్యూర్ కనీసం 15 నుంచి 20 ఏళ్ల మధ్య ఉంటుంది. లోన్ తీసుకున్న మొదట్లో ఈఎంఐలు కట్టడం పెద్ద ఇబ్బందిగా ఉండదు. కాని రెండు, మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత బాధ్యతలు పెరగడంతో కష్టాలు మొదలవుతాయి. అంటే పిల్లలు స్కూల్ ఫీజులు, ఇంట్లో కుటుంబసభ్యుల హాస్పిటల్ ఖర్చులు, పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు ఇలా అనేక కారణాలతో ఈఎంఐలు సరిగ్గా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఎదుగుదల లేకపోవడం, ఖర్చులు పెరిగిపోవడంతో నెలనెలా ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారుతుంది. 
 

35

అయితే బ్యాంకులు సాధారణంగా 3 నెలల వరకు తమ కస్టమర్లను ఇబ్బంది పెట్టకుండా నోటీసులు పంపి హెచ్చరిస్తాయి. 3 నెలలు దాటితే లీగల్ యాక్షన్స్ కి సిద్ధమవుతాయి. 

ఒక నెల హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించకపోతే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. తర్వాత ఈఎంఐతో కలిపి కట్టొచ్చు. అయితే అదనపు ఛార్జీలతో కలిపి కట్టాల్సి ఉంటుంది. చెక్ బౌన్స్ ఛార్జీలు విధించే అవకాశాలు కూడా ఉంటాయి. 

రెండు నెలల పాటు మీరు ఈఎంఐలు కట్టకపోతే మీ రిజిస్టర్ మొబైల్ కి బ్యాంకు నుంచి వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఒక్కోసారి నోటీసులు కూడా రావొచ్చు. రెండు నెలల ఈఎంఐలు, అదనపు ఛార్జీలు కలిపి కట్టండని నోటీసులో బ్యాంకు కోరుతుంది.  

45

మరి మూడో నెల కూడా ఈఎంఐ కట్టకపోతే సమస్య తీవ్రమవుతుంది. బ్యాంకు మిమ్మల్ని లోన్ ఎగ్గొట్టిన వారి జాబితాలోకి చేరుస్తుంది. కంటిన్యూగా నోటీసులు పంపిస్తుంది. వాటికి కూడా మీరు స్పందించకపోతే మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. భవిష్యత్తులో ఇక ఎలాంటి రుణాలు రావు. చివరిగా రికవరీ ఏజెంట్లు మీ ఇళ్లకు వచ్చి మీతో మాట్లాడతారు. లోన్ రికవరీ ఎప్పుడు  చేస్తారని హామీ తీసుకొని వెళతారు. మీరు కట్టలేనంటే వారి పద్ధతుల్లో లోన్ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. 

3 నెలలు దాటినా అంటే నాలుగో నెల వచ్చినా మీరు ఈఎంఐ కట్టకపోతే  బ్యాంకులు మీపై SARFAESI(సర్ఫీసీ) యాక్ట్-2002 ప్రకారం చర్యలు తీసుకుంటాయి. అంటే.. రెండు నెలల పాటు కంటిన్యూగా నోటీసులు పంపిస్తాయి. వాటికి కూడా మీరు స్పందించకపోతే మీరు తాకట్టు పెట్టిన ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటాయి. లేదా మీకు హామీ ఇచ్చిన వారిని సంప్రదించి లోన్ డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తాయి. 
 

55

పరిష్కారం ఏమిటి?
ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు ఈఎంఐలు కట్టలేని పరిస్థితికి వస్తే నిజాయితీగా బ్యాంకు అధికారులను సంప్రదించండి. వారికి మీ పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పండి. వడ్డీ తగ్గించమని, లేదా లోన్ టెన్యూర్ పెంచమని అడగండి. అలాకాకుండా అసలు మీరు ఈఎంఐలు ఎప్పటికీ కట్టలేని పరిస్థితి ఉంటే మీ ఇంటిని బ్యాంకు ద్వారానే అమ్ముకోవడం మంచిది. ఏజెంట్ల ద్వారా అమ్ముకోవడం వల్ల మీరు ఎక్కువ డబ్బు పోగొట్టుకుంటారు. 

మాయ మాటలు నమ్మకండి, పర్సనల్ లోన్ తీసుకొనే ముందు ఈ 7 విషయాలు తెలుసుకోండి

click me!

Recommended Stories